Heat Wave | హైదరాబాద్‌లో మండుటెండలు..! తలెత్తుతున్న జీర్ణకోశ సమస్యలు..!!
Heat Wave | హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. పొద్దున 7 గంటల నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. మండుటెండలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. అంతేకాదు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Heat Wave | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్నాయి. పొద్దున 7 గంటల నుంచే భానుడు భగభగ మండిపోతున్నాడు. మండుటెండలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. అంతేకాదు.. అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. వేసవి తీవ్రత కారణంగా చాలా మంది జీర్ణకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రుల పాలవుతున్నట్లు తేలింది.
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో గత వారం రోజుల నుంచి చాలా మంది అనారోగ్యాలకు గురై ఆస్పత్రులకు తరలివస్తున్నారని గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ వారం రోజుల్లోనే రోగుల సంఖ్య 20 శాతం పెరిగిందని పేర్కొన్నారు.
డీహైడ్రేషన్, వాంతులు, కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారని తెలిపారు. వారం రోజుల వ్యవధిలోనే చిలకలగూడ ఏరియాకు చెందిన 65 మంది అనారోగ్యానికి గురై గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇందుకు కారణం తాగునీటిలో మురికి నీరు కలవడమేనని స్పష్టం చేశారు. ఈ నీటిని తాగడంతో జీర్ణకోశ సమస్యలు తలెత్తి ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు.
ఎండలు ముదిరితే చాలా మంది జీర్ణకోశ సమస్యలు ఏర్పడుతాయని వైద్యులు పేర్కొన్నారు. దీనికి తోడు కలుషితం ఆహారం, నీటిని తీసుకోవడంతో సమస్య మరింత ముదిరి ఆస్పత్రి పాలవుతున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురవడంతో పాటు తిన్న ఆహారం కూడా సరిగా జీర్ణం కాదు. దీంతో డయేరియా లేదా మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




