త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyberabad Police | పోలీసుల‌కు హ్యాట్స‌ప్.. వ‌ర్షంలోనూ ప్ర‌జాసేవ‌కే అంకితం

Cyberabad Police | సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. వ‌ర్షంలోనూ ప్ర‌త్యేకంగా విధులు నిర్వ‌హిస్తూ ప్ర‌జాసేవ‌కే అంకిత‌మ‌వుతున్నారు. సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌ పరిధిలో శ‌నివారం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లపై ప్రత్యేకంగా విధులు నిర్వర్తించారు.

S

Hyderabad | Published On Jun 13, 2026, 6.21 pm IST

Cyberabad Police | పోలీసుల‌కు హ్యాట్స‌ప్.. వ‌ర్షంలోనూ ప్ర‌జాసేవ‌కే అంకితం
Advertisement

Cyberabad Police | త్రినేత్ర‌.న్యూస్‌: సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. వ‌ర్షంలోనూ ప్ర‌త్యేకంగా విధులు నిర్వ‌హిస్తూ ప్ర‌జాసేవ‌కే అంకిత‌మ‌వుతున్నారు. సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌ పరిధిలో శ‌నివారం కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు, సిబ్బంది రోడ్లపై ప్రత్యేకంగా విధులు నిర్వర్తించారు. ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు.

దీంతోపాటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నారు. వర్షపు నీటితో నిండిన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ, ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా త‌గు సూచనలు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉంటూ భ‌రోసా ఇస్తున్నారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement