త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ground Water | హైద‌రాబాద్‌లో అడుగంటిన భూగ‌ర్భ జ‌లాలు.. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలే కార‌ణ‌మా..?

Ground Water | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో రోజురోజుకు నీటి ఎద్ద‌డి ముంచుకొస్తున్న‌ది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భూగ‌ర్భ జ‌లాలు( Ground Water ) అడుగంటి పోతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండ‌లి( jalamandali ) వాట‌ర్ ట్యాంక‌ర్ల‌తో పాటు ప్ర‌యివేటు వాట‌ర్ ట్యాంక‌ర్ల‌కు( Water Tankers ) డిమాండ్ భారీగా పెరిగింది.

S

Hyderabad | Published On May 7, 2026, 7.13 am IST

Ground Water | హైద‌రాబాద్‌లో అడుగంటిన భూగ‌ర్భ జ‌లాలు.. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలే కార‌ణ‌మా..?
Advertisement

Ground Water | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలో రోజురోజుకు నీటి ఎద్ద‌డి ముంచుకొస్తున్న‌ది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో భూగ‌ర్భ జ‌లాలు( Ground Water ) అడుగంటి పోతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండ‌లి( jalamandali ) వాట‌ర్ ట్యాంక‌ర్ల‌తో పాటు ప్ర‌యివేటు వాట‌ర్ ట్యాంక‌ర్ల‌కు( Water Tankers ) డిమాండ్ భారీగా పెరిగింది. అయితే ప్ర‌ధానంగా న‌గ‌రంలోని ప‌శ్చిమ ప్రాంతంలోనే భూగ‌ర్భ జ‌లాలు పూర్తిస్థాయిలో అడుగంటి పోయిన‌ట్లు గ్రౌండ్ వాట‌ర్ డిపార్ట్‌మెంట్‌ విచార‌ణ‌లో తేలింది. ఇందుకు కార‌ణం.. బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలే అని అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌స్తున్నారు.

రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాట‌ర్ డిపార్ట్‌మెంట్ నివేదిక ప్ర‌కారం.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని గ‌చ్చిబౌలి, మాదాపూర్, శంషాబాద్, మోకిల‌, శేరిలింగంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్‌తో పాటు మ‌హేశ్వ‌రం, శంక‌ర్‌ప‌ల్లి ఏరియాల్లో పూర్తిస్థాయిలో భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోయాయ‌ని తేలింది. ఈ ప్రాంతాల్లో ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచే నీటి కొర‌త ఏర్ప‌డింద‌ని.. దాని ఫ‌లితంగా ఫిబ్ర‌వ‌రి నుంచి వాట‌ర్ ట్యాంక‌ర్ల‌కు డిమాండ్ పెరిగింద‌న్నారు.

జ‌న‌వ‌రి నెల‌లో భూగ‌ర్భ జ‌లాలు 1.99 మీట‌ర్ల లోతులో ఉండ‌గా, ఏప్రిల్ నెల చివ‌రి నాటికి 2.97 మీట‌ర్ల లోతుకు చేరింది. దీంతో బోర్ వాట‌ర్ తీసుకోలేని ప‌రిస్థితి దాపురించింది.

భూగ‌ర్భ జ‌లాలు అడుగంట‌డానికి కార‌ణం ఏంటి..?

భూగ‌ర్భ జ‌లాలు అడుగంటి పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. హైద‌రాబాద్ న‌గ‌రానికి ప‌శ్చిమం వైపున బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు పుట్ట‌గొడుగుల మాదిరి పుట్టుకురావ‌డ‌మే. ప‌శ్చిమం వైపు 40 అంత‌స్తుల‌కు పైనే భ‌వ‌నాల నిర్మాణాలు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఇలాంటి భ‌వ‌నాలు వంద‌ల సంఖ్య‌లో ఉన్నాయి. ఈ బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాల వ‌ల్లే భూగ‌ర్భ జ‌లాలు తీవ్రంగా అడుగంటిపోతున్నాయ‌ని, తద్వారా ట్యాంక‌ర్ల‌కు డిమాండ్ పెరిగింద‌ని భూగ‌ర్భ జ‌ల శాఖ అధికారులు పేర్కొన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చితే.. గ‌చ్చిబౌలి, శేరిలింగంప‌ల్లి, మోకిల‌, మాదాపూర్, హ‌ఫీజ్‌పేట్, దుర్గంచెరువు, నిజాంపేట్, కూక‌ట్‌ప‌ల్లి వంటి ప్రాంతాల్లో గ్రౌండ్ వాట‌ర్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని జ‌ల‌మండ‌లి అధికారులు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌లమండ‌లి ట్యాంక‌ర్ల‌కు బుకింగ్స్ పెరిగాయ‌ని తెలిపారు.

Advertisement
Advertisement