త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

GHMC | 17,957 నిర్మాణ‌, లేఅవుట్ అనుమ‌తులు : జీహెచ్ఎంసీ

GHMC | 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ నుంచి 17,957 నిర్మాణ, లేఅవుట్ అనుమతులు జారీ అయ్యాయి. ఈ మేర‌కు జీహెచ్ఎంసీ అధికారికంగా శుక్ర‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

S

Hyderabad | Published On Apr 3, 2026, 5.56 pm IST

GHMC | 17,957 నిర్మాణ‌, లేఅవుట్ అనుమ‌తులు : జీహెచ్ఎంసీ
Advertisement

GHMC | త్రినేత్ర‌.న్యూస్ : 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ నుంచి 17,957 నిర్మాణ, లేఅవుట్ అనుమతులు జారీ అయ్యాయి. ఈ మేర‌కు జీహెచ్ఎంసీ అధికారికంగా శుక్ర‌వారం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. బిల్డింగ్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లేఅవుట్ అనుమతులను బిల్డ్ నౌ పోర్టల్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది.

బిల్డ్ నౌ పోర్టల్‌ను 2025 మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. అప్లికేషన్లు ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టంట్ అప్రూవల్, సింగిల్ విండో విధానాల్లో పరిశీలించి అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 15,536 నిర్మాణ అనుమతులు మంజూరు కాగా, అందులో 12,014 ఇన్‌స్టంట్ అప్రూవల్, 2,515 సింగిల్ విండో, 972 ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్ కింద జారీ అయ్యాయి. అదనంగా 29 లేఅవుట్ అనుమతులు మంజూరు చేశారు.

గత ఆర్థిక సంవత్సరంలో 2,427 ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారు. నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల ద్వారా రూ.1,172.08 కోట్ల ఆదాయం లభించగా, గత ఏడాది రూ.1,138.44 కోట్లతో పోలిస్తే పెరుగుదల నమోదైంది. కార్పొరేషన్ వారీగా సిఎంసీ రూ.538.09 కోట్లు, జీహెచ్‌ఎంసీ రూ.436.47 కోట్లు, ఎంఎంసీ రూ.198.24 కోట్లు వసూలు చేశాయి. BuildNow పోర్టల్ ద్వారా అనుమతుల ప్రక్రియ వేగవంతం, పారదర్శకత పెరిగినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.

Advertisement
Advertisement