Ganja Gang | ఓల్డ్ సిటీలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. ముగ్గురు ఎంఐఎం కార్యకర్తలకు తీవ్ర గాయాలు
Ganja Gang | హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. మంగళవారం అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని శాస్త్రిపురంలో గంజాయి గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరి దాడిలో ఓ ముగ్గురు ఎంఐఎం కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు.
Ganja Gang | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. మంగళవారం అర్ధరాత్రి ఓల్డ్ సిటీలోని శాస్త్రిపురంలో గంజాయి గ్యాంగ్ విధ్వంసం సృష్టించింది. వీరి దాడిలో ఓ ముగ్గురు ఎంఐఎం కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం అర్ధరాత్రి శాస్త్రిపురంలో మహ్మద్ ఖదీర్, మహ్మద్ ఖలీల్, మహ్మద్ అల్తాఫ్ అనే ముగ్గురు ఎంఐఎం కార్యకర్తలు తమ నివాసాల ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అటుగా వచ్చిన ఓ ఆరుగురు వ్యక్తులు.. ఆకస్మాత్తుగా ఎంఐఎం కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఖదీర్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమయ్యే లోగా దుండగులు పారిపోయారు. రక్తస్రావంతో బాధపడుతున్న కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎంఐఎం కార్యకర్తలపై దాడికి పాల్పడ్డ గ్యాంగ్ గంజాయి మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దాంతో పాటు కార్యకర్తలపై కొంత ద్వేషం కారణంగా కూడా దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
అయితే ఎంఐఎం కార్యకర్తలపై దాడుల అనంతరం.. ఓ కొంత మంది వ్యక్తులపై స్థానికులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో మూడు బైక్‌లు కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




