Gandhi Sarovar Project | గాంధీ సరోవర్ ప్రాజెక్టు స్వరూపం ఇదే.. బాపు ఘాట్ వద్దనే ఎందుకు నిర్మిస్తున్నారంటే..?
Gandhi Sarovar Project | కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి మూసీ నదీ పునరుద్ధరణ ప్రాజెక్టు అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. మొత్తం 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు.
Gandhi Sarovar Project | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి మూసీ నదీ పునరుద్ధరణ ప్రాజెక్టు అధికారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. మొత్తం 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఇక బాపు ఘాట్ ప్రాంతంలోనే ఎందుకు గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపట్టాల్సి వస్తుందో కూడా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎం.డి. ఈ వెంకట నర్సింహారెడ్డి మూసీ పునరుద్ధరణ వివరాలను ప్రజంటేషన్ గా ఇచ్చారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఇక్కడ ఎందుకు ఉండాలని చాలా మంది అడుగుతున్నారు. అయితే 1948లో గాంధీని చంపినప్పుడు.. ఆయన అస్థికలను దేశంలోని 12 నదుల్లో కలిపారు. కన్యాకుమారి వద్ద కలిసే రెండు సముద్రాల్లోనూ గాంధీ అస్థికలు కలిపారు. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మూసా, ఈసా నదుల సంగమం ఉంది. నాడు గాంధీ అస్థికలను ఈ సంగమంలో కలిపారు. ఇంతటి పవిత్రమైన ప్రాంతానికి ఏదైనా ప్రత్యేకత ఉండాలని చెప్పి నాటి ప్రభుత్వం 66 ఎకరాల భూమి కేటాయించి బాపు ఘాట్‌ను నిర్మించారని తెలిపారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్టు పూర్తి స్వరూపం ఇలా..
ఈ ప్రాంతాన్ని ఇలానే వదిలేస్తే గాంధీయిజంను ఎలా ప్రమోట్ చేస్తాం. భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఒక స్టడీ ఏరియాగా తీర్చిదిద్దాలని ఆలోచన వచ్చినప్పుడు సీఎం ఈ ప్రతిపాదన చేశారు. ఈ గాంధీ సరోవర్ టవర్‌లో కింద మ్యూజియం ఉంటుంది.. చివరన గాంధీ విగ్రహం ఉంటుంది. ఇక మధ్యలో హ్యాండ్లూమ్ ట్రైనింగ్ సెంటర్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ హబ్, పబ్లిక్ రిక్రియేషన్ స్పేసెస్, నేషనల్ మ్యూజియం, మెడిటేషన్ అండ్ వెల్‌నెస్ విలేజెస్ ఉంటాయి.
200 ఎకరాల్లో.. 123 ఫీట్ల ఎత్తులో
గాంధీ సరోవర్ ప్రాజెక్టును 200 ఎకరాల్లో చేపట్టనున్నారు. 100 మీటర్ల వెడల్పులో 123 ఫీట్ల ఎత్తులో గాంధీ విగ్రహం ఉంటుంది. గాంధీ మ్యూజియం, వ్యూ ప్లాట్ ఫామ్స్ ఉంటాయి. గాంధీ విగ్రహం వద్ద ఫొటోలు కూడా తీసుకోవచ్చు. కల్చరల్ అండ్ ఎగ్జిబిషన్ స్పేస్ , రీసెర్చ్ సెంటర్ కూడా ఉంటుంది అని అధికారులు తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



