Ahmed Pasha Qadri | చార్మినార్ మాజీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూత
Ahmed Pasha Qadri | చార్మినార్ మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ఒవైసీ దవాఖానాలో తుదిశ్వాస విడిచారు.
Ahmed Pasha Qadri | చార్మినార్ మాజీ ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని ఒవైసీ దవాఖానాలో తుదిశ్వాస విడిచారు. గతేడాది నవంబర్ 30న ఆరోగ్య సమస్యలతో కంచన్ బాగ్‌లోని ఒవైసీ ఆస్పత్రిలో చేరారు. రెండేళ్లుగా రెండేళ్లుగా మూత్రపిండ వ్యాధులతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. అహ్మద్ పాషా 2004లో తొలిసారి చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2004, 2009, 2014 ఎన్నికల్లో మూడుసార్లు చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే, 2018 లో యాకుత్‌పురా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన ఎంఐఎం పార్టీలో కీలక నేత. ప్రస్తుతం ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ పదవిలో కొనసాగుతున్నారు. 2008లో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఆ పార్టీని బలోపేతం చేయడంలో కీలకపాత్ర వహించారు. ఆయన మరణం ఆ పార్టీకి పెద్దలోటుగా భావిస్తున్నారు. పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన మరణంపై పార్టీ సంతాపం ప్రకటించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




