First IVF Baby | గాంధీ దవాఖానలో సరికొత్త చరిత్ర.. తొలిసారి ఐవీఎఫ్ పద్ధతిలో శిశువు జననం
First IVF Baby | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని గాంధీ దవాఖాన సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రభుత్వ ఐవీఎఫ్ పద్ధతిలో తొలిసారిగా ఓ మహిళ శిశువుకు (First IVF Baby |) జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉండగా, వారిని బుధవారం డిశ్చార్జ్ చేయనున్నారు. ప్రైవేటు దవాఖానల్లో రూ.లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్సను తెలంగాణ ప్రభుత్వం గాంధీ హాస్పిటల్‌లో పూర్తి ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగరానికి చెందిన ఓ జంటకు ఏడేండ్ల క్రితం వివాహం జరిగింది. పిల్లల కోసం పలు ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించారు. అయితే భారీగా డబ్బులు ఖర్చయ్యాయి తప్ప ఫలితం లేకపోయింది. దీంతో సన్నిహితుల సూచన మేరకు 2024 అక్టోబర్‌లో వారు గాంధీ హాస్పిటల్‌లో ఉన్న సంతాన సాఫల్య కేంద్రానికి వచ్చారు. ప్రైవేటు ఫెర్టిలిటీ సెంటర్‌లో ఇంట్రాయుటెరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) విఫలమైందని తెలుసుకున్న డాక్టర్లు ఇన్‌విట్రో ఫైర్టిలైజేషన్ (ఐవీఎఫ్) చికిత్స అందించారు. ఆ ప్రయత్నం విజయవంతమవడంతో ఫిబ్రవరి 7న ఆమె పండంటి శిశువుకు జన్మనిచ్చారు. దీంతో ప్రభుత్వ దవాఖానలో ఐవీఎఫ్ ద్వారా విజయవంతమైన మొదటి కేసుగా నిలిచింది. ఈ విషయాన్ని వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




