Fire Accident | హయత్‌నగర్‌లో అగ్నిప్రమాదం.. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ దుకాణాల్లో మంటలు
Fire Accident | హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న జయశ్రీ ఎలక్ట్రానిక్స్, లక్ష్మీనరసింహ కార్ డెకార్స్‌తో పాటు సమీపంలోని ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Fire Accident | హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం అగ్నిప్రమాదం కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న జయశ్రీ ఎలక్ట్రానిక్స్, లక్ష్మీనరసింహ కార్ డెకార్స్‌తో పాటు సమీపంలోని ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటలు ఎగసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
దీంతో హయత్‌నగర్ పోలీసులు, ఫైర్ సిబ్బంది తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కొంతసేపు తీవ్రంగా వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో జయశ్రీ ఎలక్ట్రానిక్స్ షాప్‌తో పాటు ఫర్నిచర్ దుకాణానికి గణనీయమైన ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టమైతే జరుగలేదు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు పక్కనున్న ఇతర షాపులకు వ్యాపించకుండా నిలువరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




