Etala Rajendar | మోదీ చేసినట్టు 10 శాతం చేసినా కచ్చితంగా గెలుస్తం
Etala Rajendar | తెలంగాణలో కచ్చితంగా గెలిచి తీరాలని మొన్న నితిన్ నబీన్ వచ్చినప్పుడు చెప్పారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సైబరాబాద్ మున్సిపాలిటీ మీద ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పారు. కానీ సమస్యలు పరిష్కరించకుండా బాయ్ బాయ్ చెబితే గెలవలేమన్నారు.
- మొన్న నితిన్ నబీన్ వచ్చినప్పుడు కూడా గెలిచి తీరాలని చెప్పి వెళ్లారు
- సైబరాబాద్ మున్సిపాలిటీలో ఎగిరేది కాషాయ జెండానే
- కానీ సమస్యలు పరిష్కరించకుండా బాయ్ బాయ్ చెబితే గెలవలేం
- మోదీ పేరు చెప్తే దేశం పులకించిపోతది
- కార్యకర్తలు, ప్రజలే మన వీఐపీలు
- రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ దిశానిర్దేశం
Etala Rajendar | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో కచ్చితంగా గెలిచి తీరాలని మొన్న నితిన్ నబీన్ వచ్చినప్పుడు చెప్పారని మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సైబరాబాద్ మున్సిపాలిటీ మీద ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పారు. కానీ సమస్యలు పరిష్కరించకుండా బాయ్ బాయ్ చెబితే గెలవలేమన్నారు. ప్రజా సంబంధాలే నాయకులకు కొలమానమని చెప్పారు. మోదీ చేసేదాంట్లో పది శాతం చేసినా కచ్చితంగా గెలుస్తామన్నారు. ఆయన పురు చెబితే దేశం పులకించిపోతుందని కొనియాడారు. మంగళవారం నిర్వహించిన బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈటల ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రేటర్ ఎన్నికలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
సైబరాబాద్ మున్సిపాలిటీ మీద ఎగిరేది కాషాయ జెండానే. నేను ఎంపీగా గెలిచిన తరువాత ఎల్బీనగర్ నియోజకవర్గం కార్పొరేటర్లకి కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు మాలాంటి వారి అవసరం లేకుండానే ప్రజల పనులు చేసిపెట్టగల సత్తా సంతరించుకున్నారు. అందుకే గెలుపు చాలా ముఖ్యం. మనందరికీ గౌరవాన్ని గుర్తింపుని ఇచ్చేది పార్టీ జెండా మాత్రమే. గెలిచేవారికి అవకాశాలు వెతుక్కొని వస్తాయి అని ఈటల పేర్కొన్నారు.

మోదీకి గర్వం లేదు..
2014 నుండి నేను మోదీని చూస్తున్నా. ఆయనకు గర్వం లేదు. నేను చేసిన అని ఏనాడు చెప్పరు. ప్రజలకు సేవకుణ్ణి అని చెప్తారు. మీ అందరూ ఆరితేరి ఉన్నారు. అయినా మోదీ చేసే దానిలో పది శాతం చేసినా మనం గెలిచి తీరుతాం. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, ప్రధాని అయిన నాయకుడు నరేంద్ర మోదీ. ఏనాడు ఓడిపోలేదు. మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తరువాత మొదట అడుగు పెట్టిన గడ్డ హైదరాబాద్. ఆయనకు మనమంటే అమితమైన ప్రేమ అని ఎంపీ రాజేందర్ చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ గెలవదని మంత్రులు, ఎమ్మెల్యేలే అంటున్నరు..
మాటల గారడి చేసి గెలిచిన రేవంత్ రెడ్డి రెండేళ్లకే వెల్లకిలా పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులే అంటున్నారు. దీపం ఉన్నప్పుడే చక్క పెట్టుకోవాలని చూస్తున్నారు. దేశ ప్రజలకు విశ్వాసం కల్పించి మూడోసారి గెలిచిన మహా నాయకుడు నరేంద్ర మోదీ. అబ్ కీ బార్ చార్ సౌ పార్ నినాదం మనం కాదు ప్రజలిచ్చారు. స్థానిక నాయకులు గొప్పగా ఉంటేనే పార్టీ గెలుస్తుంది. ప్రజలు ప్రేమించే నాయకులుగా ఉండాలి.
మొన్న మమ్మల్ని గెలిపించారు.. నేడు మిమ్మల్ని గెలిపిస్తం..
ఈ పార్లమెంట్‌లో నన్ను తిట్టేవారు లేరని నేను గర్వంగా చెప్పుకుంటా. నాయకుడు పార్టీకి వెలుగునిస్తే.. నాయకుడికి పార్టీ వెలుగునిస్తుంది. నాయకుడు పార్టీకి భారం కావొద్దు. కార్యకర్తలు, ప్రజలే మన వీఐపీలు. మొన్న మమ్మల్ని గెలిపించారు. నేడు మిమ్ముల్ని గెలిపించడంలో మా శాయశక్తులా కృషి చేస్తాం. నెగెటివ్ మాట్లాడడం బంద్ చేయండి. నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే మన విజయాన్ని ఎవరూ ఆపలేరు అని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్‌చందర్ రావు, రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ జీ, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు సామ రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు, జాతీయ నాయకులు పెరాల శేఖర్ జీ, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ప్రభా గౌడ్, రవికుమార్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నుకుల పద్మారెడ్డి, బండారు శైలజ, శ్రీదేవి రెడ్డి, కాలేం రవీందర్, కొత్త రవీందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు బండారు భాస్కర్, యశ్‌పాల్ గౌడ్, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షులు గుండె కిరణ్ కుమార్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు నవంజీవన్ రెడ్డి, లచ్చి రెడ్డి, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, రంగా నర్సింహా గుప్తా, జిల్లా కార్యవర్గ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
జులై 19, 2026

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
జులై 19, 2026

Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్
జులై 19, 2026
తాజావార్తలు
- ●MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి
- ●Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్
- ●Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?
- ●Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
- ●Telangana Weather Update | తెలంగాణపై వరుణుడి పంజా: ఈ 6 జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఐఎండీ వారం రోజుల రిపోర్ట్
- ●Minister Uttam Kumar Reddy | సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ : మంత్రి ఉత్తమ్

MLC Deshapathi Srinivas | మా రక్తం తీసుకో.. కానీ రైతులకు కాళేశ్వరం నీళ్లివ్వు : ఎమ్మెల్సీ దేశపతి

Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డికి బూతు పంచాంగం తప్ప ఏం తెలియదు : దాసోజు శ్రవణ్

Anupama Parameswaran | కోలీవుడ్ హీరోతో బ్రేకప్ - అనుపమ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ - అన్‌ఫాలో చేసిందా?

Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం



