Electricity Outage | హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో కరెంటు కట్
Electricity Outage | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కరెంటు కోతలు (Electricity Outage) విధించనున్నారు.
Electricity Outage | త్రినేత్ర.న్యూస్: మరికొన్ని రోజుల్లో ఎండల తీవ్రత పెరుగనున్నది. దీనికి ఈదురు గాలులు కూడా తోడుకానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ లైన్ల కింద ఉండే చెట్లను కొట్టేయడంతోపాటు, కిందికి వేలాడే వైర్లను పైకి బిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కరెంటు కోతలు (Electricity Outage) విధించనున్నారు. బంజారాహిల్స్, చిక్కడపల్లి, ఉప్పల్, చిలుకానగర్, రామంతాపూర్, కేపీహెచ్‌బీ కాలనీల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.
బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలోని 11కేవీ జవహర్ నగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 9.30 నుంచి 10.15 గంటల వరకు, 11కేవీ లుంబిని మాల్, శాంగ్రిళ్ల ప్లాజా, సత్యసాయి ఫీడర్ల పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, 11కేవీ స్టేట్ హోం ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉ దయం 10.30 నుంచి 11 గంటల వరకు, 11కేవీ మారుతి నగర్ ఫీడర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు విద్యుత్ ఉండదు.
11కేవీ అక్బర్ ఫామ్ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటిగంట వరకు, ఇంజినీర్స్ కాలనీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 1.30 గంటల వరకు, రామానాయుడు స్టూడియో ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు, సీఓడీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, 11కేవీ తాతారావు, కమలాపురి కాలనీ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంటు కోతలు ఉంటాయి.
ఇక ఆజామాబాద్ డివిజన్, హైదరాబాద్ సిటీ-2 పరిధిలోని చెన్నారెడ్డినగర్, పటేల్‌నగర్, బాపునగర్, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, ఏవీ కాలేజ్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, జగదీశ్‌మార్కెట్, జేఎన్ ఫీడర్ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, పటేల్ నగర్, అలీకేఫ్, ప్రేమ్‌నగర్, గగన్‌మహల్ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగనుంది.
చిల్కానగర్ పరిధిలోని బాలాజీ హిల్స్ ఫీడర్, నార్త్ బాలాజీ హిల్స్, రాజశేఖర్ కాలనీ, బాలాజీ హిల్స్, వెస్ట్, ఈస్ట్ బాలాజీ హిల్స్, మెక్‌డోవెల్ కాలనీ, న్యూ రామ్‌నగర్, న్యూ హేమానగర్, ఆదర్శ్ నగర్ ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదు. అయ్యప్ప టెంపుల్ ఫీడర్ పరిధిలోని ఈస్ట్ బాలాజీ హిల్స్, శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీ, స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కరెంటు ఉండదు.
రామంతాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో శ్రీనగర్ ఫీడర్‌లో శ్రీనగర్ కాలనీ, భరత్‌నగర్, శ్రీరమణ పురం, సత్యనగర్, కుర్మనగర్, కేసీఆర్‌నగర్, కమాన్, సబ్ రిజిస్ర్టార్ కార్యాలయం ప్రాంతాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ ఉండదు. కామాక్షిపురం ఫీడర్‌లోని వివేక్‌నగర్, కామాక్షిపురం, వాసవినగర్, రాంరెడ్డినగర్‌లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా ఉండదని అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




