Drugs Party | హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. గచ్చిబౌలిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
Drugs Party | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గచ్చిబౌలి ప్రాంతంలో ఓ స్టార్ జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగిల్ ఫోర్స్, పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు జరిపి, పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
Drugs Party | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. గచ్చిబౌలి ప్రాంతంలో ఓ స్టార్ జరుగుతున్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈగిల్ ఫోర్స్, పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు జరిపి, పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి మసీద్ బండా ప్రాంతంలోని కోవ్ స్టేస్ (Kove Stays) హోటల్‌లో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా మంగళవారం రాత్రి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి రూమ్ నెంబర్ 309లో ఈగిల్ ఫోర్స్, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏడుగురు యువకులు మద్యం సేవిస్తున్నట్లుగా గుర్తించారు.
గదిలో తనిఖీలు చేసినా మత్తు పదార్థాలు భౌతికంగా దొరకలేదు. అనుమానం వచ్చి అందరికీ యూరిన్ డ్రగ్ టెస్ట్ నిర్వహించగా.. పరీక్షల్లో గంజాయి సేవించినట్లుగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అదే రోజు గంజాయి సేవించినట్లుగా సదరు యువకులు అంగీకరించినట్లుగా పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిని మెఘేందర్ (29), తేజేశ్వర్ (28), సాయి ప్రసాద్ (28), రమేష్ (27), టీ రవి (27)గా గుర్తించారు. ఓ వివాహ వేడుకలో పాల్గొన్నామని.. అప్పటి నుంచే గంజాయికి అలవాటు పడ్డట్లుగా యువకులు చెప్పారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ అలవాటు క్రమంగా కొనసాగుతుందని, తాజాగా రీయూనియన్ జరుపుకునే ఉద్దేశంతో కోవ్ స్టేస్ హోటల్‌లో పార్టీ చేసుకుంటున్నట్లుగా సమాచారం. గంజాయి వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దరా్యప్తు చేస్తున్నారు. అయితే, ఆ పార్టీలో పాల్గొన్న యువకుల్లో నగరంలో ప్రముఖ స్టార్ హోటల్స్‌లో కీలక స్థానాల్లో ఉన్న వారు సైతం ఉన్నట్లుగా తెలుస్తున్నది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





