త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | భార్య చికెన్ వండ‌లేద‌ని.. భ‌ర్త బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

Hyderabad | చికెన్ (chicken) వండ‌లేద‌న్న కోపంతో ర‌క్ష‌ణ శాఖ‌ విశ్రాంత విద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్ (Hyderabad) మేడిప‌ల్లిలో (Medipally) చోటుచేసుకున్న‌ది.

G

Hyderabad | Published On Feb 19, 2026, 10.04 am IST

Hyderabad | భార్య చికెన్ వండ‌లేద‌ని.. భ‌ర్త బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

పెళ్లైన నెలకే న‌వ వ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: చికెన్ (chicken) వండ‌లేద‌న్న కోపంతో ర‌క్ష‌ణ శాఖ‌ విశ్రాంత విద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్ (Hyderabad) మేడిప‌ల్లిలో (Medipally) చోటుచేసుకున్న‌ది. ప్ర‌తాప‌సింగారానికి చెందిన దాస‌రాజుల ప్ర‌కాశ్ (66) అనే రిటైర్డ్ ఉద్యోగి ఈ నెల 15న రాత్రి ఇంటికి చికెన్ తీసుకువ‌చ్చారు. భార్య ప‌ద్మ‌కు కూర‌ వండాల‌ని చెప్పారు. అయితే శివరాత్రి కావ‌డంతో.. పండుగ‌పూట మాంసం తిన‌డం మంచికాద‌ని, తాను చికెన్ వండ‌న‌ని చెప్పింది. దీంతో భార్య‌తో గొడ‌వ‌ప‌డ్డాడు. దంప‌తులిద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌వాగ్వాదం చోటుచేసుకున్న‌ది.

గొడ‌వ అనంత‌రం మ‌న‌స్థాపానికి గురైన ప‌ద్మ ఇంటి బ‌య‌ట‌కు వెళ్లారు. తిరిగి వ‌చ్చిన త‌ర్వాత చూస్తే భ‌ర్త అప‌స్మార‌క స్థితిలో కనిపించాడు. దీంతో కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించారు. వారు ప్ర‌కాశ్‌ను గాంధీ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అయితే అక్క‌డ చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. చికెన్ తెచ్చిన లొల్లి చివ‌రి అత‌ని ప్రాణం తీసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. కూర వండ‌నందుకే ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా? లేదా మ‌రేదైనా కార‌ణం ఉందా అనే కోణంలో విచార‌ణ చేస్తున్నారు.

Advertisement
Advertisement