త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | జీహెచ్ఎంసీ ప్ర‌తిజోన్‌లో ప‌ర్య‌టిస్తా : సీఎం రేవంత్‌రెడ్డి

P

Hyderabad | Published On Feb 17, 2026, 8.10 pm IST

CM Revanth Reddy | జీహెచ్ఎంసీ ప్ర‌తిజోన్‌లో ప‌ర్య‌టిస్తా : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement

CM Revanth Reddy | త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని ప్ర‌తిజోన్‌లో ప‌ర్య‌టిస్తాన‌ని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపై అధ్య‌య‌నం చేయాల‌న్నారు. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కై వాక్ బ్రిడ్జిలను ఏర్పాటుపై అధ్య‌య‌నం చేయాల‌న్నారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాల‌ని, అడ్వటైజింగ్ బోర్డుల ఏర్పాటుపై జాగ్ర‌త్త తీసుకోవాల‌న్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండి పడకుండా చర్యలు ఉండాల‌న్నారు. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10 శాతం అడ్వటైజింగ్ బోర్డు లు కేటాయించాల‌న్నారు.

అడ్వటైజింగ్ బోర్డు ల నుంచి సంవత్సరానికి ఒక సారి ఫీజు వసూలు చేయాల‌ని, అనధికార అడ్వటైజింగ్ బోర్డు పైన కఠినమైన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. నగరంలో వీధిదీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని.. వీధిదీపాల నిర్వ‌హ‌ణ విషయంలో యూనికోడ్ ఉండాల‌న్నారు. జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాల‌ని, జీహెచ్‌ఎంసీ విభజన తలెత్తిన పలు సమస్య పరిష్కారానికి సూచనలు చెప్పార‌న్నారు. మూడు కార్పొరేషన్ల‌లో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాల‌న్నారు. త్వరలో ప్రతిజోన్‌లో ప‌ర్య‌టిస్తాన‌న్నారు.

రోడ్లు శుభ్రం లేకపోతే అక్కడిక్కడే అధికారులను సస్పెండ్ చేస్తాన‌ని హెచ్చ‌రించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దునే ఫీల్డ్‌లో ఉండాల‌ని.. అన్ని పార్కుల వివ‌రాలు సేక‌రించాల‌ని ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల‌కు ఒక రోజు శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. స‌మావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు , సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, మ‌ల్కాజిగిరి క‌మిష‌న‌ర్లు ఆర్వీ క‌ర్ణ‌న్‌, సృజ‌న‌, విన‌య‌కృష్ణారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement