త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Car Accident | హీరో బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఫెరారీ కారు బీభ‌త్సం..

Car Accident | హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 45లో ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా ప్ర‌యాణిస్తున్న ఫెరారీ కారు బీభ‌త్సం సృష్టించింది.

S

Hyderabad | Published On Feb 22, 2026, 3.13 pm IST

Car Accident | హీరో బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద ఫెరారీ కారు బీభ‌త్సం..
Advertisement

Car Accident | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబ‌ర్ 45లో ఆదివారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా ప్ర‌యాణిస్తున్న ఫెరారీ కారు బీభ‌త్సం సృష్టించింది. ఫెరారీ కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్ మ‌ధ్య‌లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. రోడ్డుకు అవ‌త‌ల వైపు వ‌స్తున్న కారుపైకి దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలో అవ‌త‌లివైపు కారును మ‌రో కారు ఢీకొట్టింది. మొత్తంగా మూడు కార్లు ధ్వంస‌మ‌య్యాయి. ఫెరారీ కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అయితే ఈ ప్ర‌మాదంలో ఎవరికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో.. అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ప్ర‌మాదం కార‌ణంగా రోడ్డు నెం.45లో ట్రాఫిక్ స్తంభించింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement