త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మింగ మెతుకు లేదు కానీ.. మీసాల‌కు సంపెంగ నూనె పెట్టిండ‌ట : కేటీఆర్

KTR | మూసీ సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ విష‌యంలో సీఎం తీరు మింగ మెతుకు లేదు కానీ.. మీసాల‌కు సంపెంగ నూనె పెట్టిన‌ట్లు ఉంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

S

Hyderabad | Published On Mar 14, 2026, 7.48 pm IST

KTR | మింగ మెతుకు లేదు కానీ.. మీసాల‌కు సంపెంగ నూనె పెట్టిండ‌ట : కేటీఆర్
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మూసీ రివ‌ర్ ఫ్రంట్ విష‌యంలో సీఎం తీరు మింగ మెతుకు లేదు కానీ.. మీసాల‌కు సంపెంగ నూనె పెట్టిన‌ట్లు ఉంద‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. హిమాయ‌త్ సాగ‌ర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప‌వ‌ర్ పాయింట్ వ‌ర్సెస్ ప‌బ్లిక్ పాయింట్ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు.

నిన్న సీఎం ఏర్పాటు చేసిన స‌మావేశం ద్వారా మూసీ బాధితుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త ఏదైనా చెబుతారేమో అని ఆశించాం. కానీ ఆ ప్ర‌స్తావ‌నే లేదు. నా వ‌ద్ద బుడ్డ పైస లేదు. న‌న్ను కోస్తే కూడా రూపాయి రాదు.. నేను ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోతారేమో అని భ‌య‌ప‌డుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల‌కు, రైతుల‌కు రైతుబంధు ఇచ్చేందుకు డ‌బ్బుల్లేవు. ఆరు గ్యారెంటీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన మాట వాస్త‌వ‌మే కానీ ఇప్పుడు వాటి గురించి మాట్లాడే ప‌రిస్థితి లేదు.. కానీ ఇప్పుడు మూసీ చేసి తీరుతా అని సీఎం రేవంత్ రెడ్డి విచిత్రంగా మాట్లాడుతున్నాడు. వంద రోజుల్లో అమ‌లు చేస్తామ‌న్న ఆరు గ్యారెంటీల‌కు డ‌బ్బుల్లేవు. కానీ మూసీని ల‌క్ష‌న్న‌ర కోట్ల‌తో సుంద‌రీక‌రించ‌డానికి డ‌బ్బులు వ‌స్తాయ‌ట‌. అందాల పోటీల‌కు రూ. 200 కోట్లు ఉంటాయి కానీ హామీల అమ‌లుకు డ‌బ్బుల్లేవు అని సీఎం అంటున్నార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు తెలంగాణ నిర్మాణంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. కేసీఆర్ నిర్మాణాత్మ‌క‌మైన ప్ర‌జెంటేష‌న్ ఇస్తే.. రేవంత్ రెడ్డి విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చారు. ఈ రెండున్న‌రేండ్ల‌లో హైద‌రాబాద్‌లో కానీ ఓఆర్ఆర్ లోప‌ల కానీ ప్ర‌భుత్వం త‌ర‌పున ఒక కొత్త ఇల్లు, ఫ్లై ఓవ‌ర్‌, బిల్డింగ్ నిర్మించారా..? ఒక్క మంచి ప‌ని చేశావా..? కానీ హైద‌రాబాద్‌తో పాటు జిల్లాల్లో వంద‌ల, వేల ఇండ్లు కూల‌గొట్టాడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో బాధితులు లేకుండా సూట్లు బూట్లు వేసుకున్న వారి మ‌ధ్య‌లో ల‌క్ష‌న్న‌ర కోట్లు ఎలా ఖ‌ర్చు పెట్టాలో పీపీటీ ఇచ్చారు. ఆస్తులు కోల్పోతున్నాం, భూములు, ఇండ్లు పోతాయి.. మా కొంప కొల్లేరు చేసి మూసీ సుంద‌రీక‌ర‌ణ చేస్తాడంటా అని ఆర్త‌నాదాలు చేస్తున్న వారి మ‌ధ్య‌లో ప‌వ‌ర్ పాయింట్ వ‌ర్సెస్ ప‌బ్లిక్ పాయింట్ అని కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌ని కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement