KTR | ఒక్క ఇల్లు కట్టినట్టు చూపించినా.. శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా.. రేవంత్‌కు కేటీఆర్ సవాల్
KTR | హైదరాబాద్ నగరంలో ఈ రెండున్నరేండ్లలో ఒక్క ఇల్లు కట్టి చూపించినా.. నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఈ రెండున్నరేండ్లలో ఒక్క ఇల్లు కట్టి చూపించినా.. నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తాను అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైదరాబాద్‌లోని నాగోల్ ఎస్టీపీని పరిశీలించిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కొన్నింటిని నేలమట్టం చేస్తే.. ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలిసో తెలియక పేదలు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలి కదా..! పేదల పట్ల కనికరం ఉండాలి కదా..! అక్రమ నిర్మాణాలను సక్రమాలు చేయాలి కదా..! అని సుద్దులు చెప్పిండు. మరి ఇవాళ ఆయన వేలాది ఇండ్లను కూలగొడుతుంటే బీఆర్ఎస్ తప్పకుండా ప్రతిఘటిస్తుంది. విధ్వంసం చేస్తామంటే ఊరుకోం. హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం. ఎక్కడా బుల్డోజర్లు వచ్చిన తప్పకుండా అడ్డుగా నిలబడుతాం. మూసీ సుందరీకరణకు మద్దతు పలుకుతాం. మూసీ పేరిట లూటీ చేస్తామంటే పేదల కడుపు కొడుతామంటే తప్పకుండా అడ్డుకుంటాం అని కేటీఆర్ హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టారు. రెండున్నరేండ్లు గడిచిననా హైదరాబాద్‌లో ఒక్క ఇ్లలు కట్టలేదు. ఇందిరమ్మ ఇల్లు లేదు. మేం కట్టిన ఇండ్లకు రంగులు వేస్తున్నడు పెయింటర్ బాబు. రంగులు మార్చి ఆ ఇండ్లకు మూడు రంగులు పూసి ఇవి మావి అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నడు. నేను చాలెంజ్ వేస్తున్నా రేవంత్ రెడ్డికి.. ఈ రెండున్నరేండ్లలో హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టినట్టు చూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని సవాల్ చేస్తున్నా. చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయ్.. పేదల ఇండ్లు కూలగొడుతామంటే.. నీ బుల్డోజర్లకు అడ్డు వస్తాం. విధ్వంసం కాదు నిర్మాణం జరగాలి. మీకు చేతగాకపోతే.. రూ. 16 వేల కోట్లతో మేం చేసి చూపెడుతాం. మాకు అప్పజెప్పు.. రెండేండ్లలో ఒక్క ఇల్లు కూలగొట్టకుండా చేసి చూపెట్టే బాధ్యత మాది.. సవాల్‌గా స్వకరిస్తాం. మూసీ సుందరీకరణను హైదరాబాద్ ప్రజల చేతుల్లో పెడుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



