త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kaleru venkatesh | బండి సంజ‌య్ అహంకారం త‌గ్గించుకో: ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేష్‌

Kaleru venkatesh | కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌న అహంకారాన్ని త‌గ్గించుకొని, త‌న కొడుకు చేసిన నేరానికి బాధ్య‌త వ‌హించాల‌ని ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేష్ డిమాండ్ చేశారు. వెంట‌నే తన కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్నారు.

S

Hyderabad | Published On May 12, 2026, 5.36 pm IST

Kaleru venkatesh | బండి సంజ‌య్ అహంకారం త‌గ్గించుకో: ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేష్‌
Advertisement

అంబ‌ర్‌పేట‌ చే నంబ‌ర్ చౌర‌స్తాలో బీఆర్ఎస్‌ భారీ రాస్తారోకో
బండి సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా ప్ల‌కార్డుల ప్ర‌ద‌ర్శ‌న‌
భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని డిమాండ్‌
లేదంటే ఎంత దూర‌మైనా వెళ్తామ‌ని హెచ్చ‌రిక

Kaleru venkatesh | త్రినేత్ర‌.న్యూస్‌: కేంద్ర మంత్రి బండి సంజ‌య్ త‌న అహంకారాన్ని త‌గ్గించుకొని, త‌న కొడుకు చేసిన నేరానికి బాధ్య‌త వ‌హించాల‌ని ఎమ్మెల్యే కాలేరు వెంక‌టేష్ డిమాండ్ చేశారు. వెంట‌నే తన కేంద్ర మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్నారు. మంగ‌ళ‌వారం అంబ‌ర్‌పేట నియోజ‌క‌వ‌ర్గం చే నంబ‌ర్ చౌర‌స్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా బండి సంజయ్‌కు, ఆయన కుమారుడు భగీరథ్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బండి భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌న్నారు.

బీజేపీ, కాంగ్రెస్ ఒక్క‌టే..

అనంత‌రం కాలేరు వెంక‌టేష్‌ మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేయ‌డం దుర్మార్గం. ఈ ఘటనలో పోక్సో చట్టం కింద కేసు నమోదు కావాల్సి ఉండగా దాన్ని హనీట్రాప్‌గా మార్చి కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలో బీజేపీ-కాంగ్రెస్ ఒక్కటే అని వస్తున్న ఆరోపణలు నిజమవుతున్నాయి. బండి సంజయ్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఈ ఘటనకు బాధ్యత వహించి ఆయన వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ప్రభుత్వం స్పందించి బండి సాయి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలి అని డిమాండ్ చేశారు.

కిష‌న్‌రెడ్డి ఎందుకు స్పందిస్త‌లేరు..

భ‌గీర‌థ్‌ను వెంట‌నే అరెస్టు చేయ‌కుంటే ఎంత‌దూర‌మైనా వెళ్తాం. బాలిక‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి.
నిష్ప‌క్ష‌పాతంగా కేసును విచారించాలి. కేంద్ర మంత్రి అయి ఉండి కిష‌న్‌రెడ్డి ఎందుకు స్పందిస్త‌లేరు? బాధిత బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంత వరకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి అని ఎమ్మెల్యే వెంక‌టేష్‌ పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement