త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threat | నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు

Bomb Threat | హైద‌రాబాద్ నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు (Nampally CBI Court) మ‌రోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) వ‌చ్చాయి. దీంతో కోర్టు భ‌వ‌నాన్ని ఖాళీ చేయించిన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

G

Hyderabad | Published On Feb 20, 2026, 12.46 pm IST

Bomb Threat | నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు
Advertisement

Bomb Threat | త్రినేత్ర‌.న్యూస్: హైద‌రాబాద్ నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు (Nampally CBI Court) మ‌రోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) వ‌చ్చాయి. దీంతో కోర్టు భ‌వ‌నాన్ని ఖాళీ చేయించిన పోలీసులు.. బాంబు స్క్వాడ్‌తో త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా నాంప‌ల్లి కోర్టుకు బాంబు బెదిరింపు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ నెల 18న నాంప‌ల్లి సీబీఐ కోర్టుతోపాటు క‌రీంన‌గ‌ర్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. 12 చోట్ల‌ ఆర్డీఎక్స్ బాంబులు (RDX Bombs) అమ‌ర్చామ‌ని, అవి మ‌ధ్య‌హ్నం 12 గంట‌ల 5 నిమిషాల‌కు పేలుతాయంటూ ఫోన్‌లో బెదిరించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు రెండు కోర్టుల్లో న్యాయ‌వాదులు, సిబ్బందిని బ‌య‌ట‌కు పంపించారు. డాగ్ స్క్వాడ్ బృందాల‌తో త‌నిఖీలు నిర్వ‌హించారు.

అయితే ఎలాంటి పేలుడు ప‌దార్థాలు లేక‌పోవ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ కాల్స్ త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చాయ‌ని, అవి ఫేక్ అని పోలీసులు నిర్ధారించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రి, , అనంతపురం జిల్లా కోర్టులకు కూడా ఇదే త‌ర‌హా బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. ఇటీవ‌ల కాలంలో త‌రచుగా కోర్టుల‌కు, పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు వ‌స్తున్నాయి.

Advertisement
Advertisement