Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానానికి బాంబు బెదిరింపు
Bomb Threat | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు.
Bomb Threat | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు (Shamshabad Airport) మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. గల్ఫ్ ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది.. విమానాన్ని క్వారంటైన్‌కు తరలించారు. క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి బాంబు లేదని తేల్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఎయిర్‌పోర్ట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారని ఆరాతీస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వరుస బాంబు బెదిరింపులు వచ్చాయి. డిసెంబర్ 21న నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న (KLM-873) విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. అయితే దానిని పరిశీలించిన భద్రతా సిబ్బంది ఎలాంటి ప్రమాదకరమై వస్తువులు లేవని తేల్చారు.
అదే నెల 10న ఆర్‌జీఐ ఎయిర్ పోర్టు (RGIA) నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందని editor@epochtimes.cpm ఐడీతో మెయిల్, +1-2016143989 నంబర్‌తో బెదిరింపు కాల్ వచ్చింది. ఆ విమానాలన్నీ టేకాఫ్ అయిన 10 నిమిషాల్లో పేల్చేస్తామంటూ మెయిల్ చేశారు. అలా జరుగకూడదంటే మిలియన్ డాలర్లు తనకు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. అయితే ఆ తర్వాత అదంతా ఉత్తదేనని అధికారులు వెల్లడించారు.
ఇక డిసెంబర్ 9న కన్నూర్-హైదరాబాద్ ఇండిగో విమానానికి, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానానికి, లండన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మరో విమానానికి బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




