త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సు.. విద్యార్థిని మృతి

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సు.. విద్యార్థిని మృతి

S

Hyderabad | Published On Apr 4, 2026, 5.31 pm IST

Hyderabad | బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సు.. విద్యార్థిని మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డు నంబ‌ర్ 5లో వేగంగా దూసుకువ‌చ్చిన ఆర్టీసీ ఎల‌క్ట్రిక్ బ‌స్సు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై తండ్రితో వెళ్తున్న ఓ స్కూల్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. తండ్రికి, సోద‌రుడికి తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. చిన్నారి మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయాల‌తో బాధ‌ప‌డుతున్న తండ్రీకుమారుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చిన్నారి కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Advertisement
Advertisement