త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganja | హైద‌రాబాద్‌లో రూ. 30 ల‌క్ష‌ల విలువ చేసే గంజాయి సీజ్

Ganja | హైద‌రాబాద్ న‌గ‌రంలో గంజాయి అమ్మ‌కాలు విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట గంజాయి స్మ‌గ్ల‌ర్లు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డుతూనే ఉంటున్నారు.

S

Hyderabad | Published On Feb 11, 2026, 5.07 pm IST

Ganja | హైద‌రాబాద్‌లో రూ. 30 ల‌క్ష‌ల విలువ చేసే గంజాయి సీజ్
Advertisement

Ganja | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో గంజాయి అమ్మ‌కాలు విచ్చ‌ల‌విడిగా కొన‌సాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట గంజాయి స్మ‌గ్ల‌ర్లు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డుతూనే ఉంటున్నారు. తాజాగా వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, ఎస్సార్ న‌గ‌ర్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించ‌గా, 70 కిలోల గంజాయి ప‌ట్టుబ‌డింది. దీని విలువ రూ. 35 ల‌క్ష‌లు ఉంటుంద‌ని పోలీసులు పేర్కొన్నారు.

గంజాయి విక్ర‌యాల‌కు పాల్ప‌డుతున్న వారిని ఒడిశాకు చెందిన రైతు మ‌నియ‌ల్ ద‌ల‌భేరా(30), మేడ్చ‌ల్ పారిశ్రామికవాడ‌లో ప‌ని చేస్తున్న ఇస్మాయిల్ రైతా(48)గా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే మ‌నియ‌ల్ త‌న సొంతూరులో వ్య‌వసాయ పొలంలో గంజాయి సాగు చేస్తున్నాడు. అయితే ఇస్మాయిల్ చేత గంజాయి విక్ర‌యించేందుకు మ‌నియ‌ల్ ఒప్పందం చేసుకున్నాడు. ఇక ఇస్మాయిల్ ధూల్‌పేట్‌, మంగ‌ళ్‌హాట్ ఏరియాల్లో తిరుగుతూ.. గంజాయి విక్ర‌యిస్తున్నాడు. పోలీసుల‌కు అందించిన విశ్వ‌స‌నీయ స‌మాచారంతో దాడులు నిర్వ‌హించి మ‌నియ‌ల్, ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement