HMWSSB | నియో పోలీస్‌లో జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు
HMWSSB | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వేగవంతంగా జనాభా వృద్ధి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తాగునీటికి రోజురోజుకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియో పోలీస్‌లో జలమండలికి 3.95 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
గ్రావిటీ ద్వారా మెహిదీపట్నం, షేక్‌పేటకు నీటి సరఫరా
బోజగుట్ట రిజర్వాయర్‌కు గోదావరి జలాలు తరలింపు
HMWSSB | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వేగవంతంగా జనాభా వృద్ధి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తాగునీటికి రోజురోజుకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియో పోలీస్‌లో జలమండలికి 3.95 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది.
గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ ఫేజ్ 2, 3, మూసీ నది పునరుజ్జీవానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను గోదావరి జలాలతో నింపడానికి అదనంగా 300 ఎంజీడీ నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిసింది. అదేవిధంగా నియో పోలీస్ ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో అధిక స్థాయి వెర్టికల్ అర్బనైజేషన్ వృద్ధి కారణంగా తాగునీటి అవసరం మరింతగా పెరిగింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆదేశాలతో కొకాపేట్ నియోపోలిస్ లేఅవుట్‌లో సంప్, పంప్ హౌస్, సెక్షన్ ఆఫీస్, జీఎల్ఎస్ఆర్, ఎస్టీపీ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో కొకాపేట్ ప్రాంతంలో జలమండలికి ఇప్పటికే ఉన్న భూమిని పూర్తిగా వినియోగించినప్పటికీ, అదనపు భూమి అవసరం ఏర్పడింది.
దీంతో ఖానాపూర్‌లో జలమండలికి ఉన్న 8.75 ఎకరాల భూమి ప్రతిపాదిత 22.5 ఎంఎల్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 2 ఎలివేటెడ్ లెవల్ సర్వీస్ రిజర్వాయర్లు (ELSRs), క్లోరినేషన్ గది, నిర్వహణ యూనిట్ నిర్మాణాలకు మాత్రమే సరిపోతుంది. దానికి అదనంగా, ఖానాపూర్ జలమండలికి ఆవరణను ఆనుకుని ఉన్న హెచ్ఎండీఏ గుర్తించిన భూములు, ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం 1.18 ఎకరాలు, హెచ్ఎండీఏ సైట్ ఆఫీస్ కోసం 0.77 ఎకరాలు, ఆశ్రమానికి చెందిన 2.00 ఎకరాలు (మొత్తం 3.95 ఎకరాలు) కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని జలమండలి అభ్యర్థించింది. సుమారు +592.00 మీటర్ల ఎత్తు స్థాయిలో ఉన్న భూభాగం టోపోగ్రాఫికల్ కంటూర్ ప్రకారం మొత్తం సర్వీస్ ప్రాంతానికి గ్రావిటీ విధానంలో తాగునీటి సరఫరా చేయడానికి అనుకూలంగా ఉంది.
కొకాపేట్ నియోపోలిస్ ప్రాంతంలో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖానాపూర్ క్యాంపస్ వద్ద పై పేర్కొన్న 3.95 ఎకరాల భూమిని జలమండలికి కేటాయిస్తూ ప్రభుత్వం ఈ రోజు ఉత్వర్వులు జారీ చేసింది. ఇక్కడ రిజర్వాయర్ ద్వారా నియో పోలీస్ కోకాపేట పరిసర ప్రాంతాలకే కాకుండా, నగరంలోని బోజగుట్ట రిజర్వాయర్‌కు గ్రావిటీతో సరఫరా చేయడమే కాకుండా.. ఓల్డ్ సిటీ,షేక్ పేట, రెడ్ హిల్స్, మెహిదీపట్నం ప్రాంతవాసులకు గ్రావిటీతో మంచినీటి సరఫరా చేసే వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




