త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ప‌ని మ‌నుషుల‌కు మ‌త్తు మందు ఇచ్చి.. రూ. 20 ల‌క్ష‌లు చోరీ..

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి రోజు ఏదో ఒక చోట చోరీలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో నేపాలీ ముఠా భారీ చోరీకి పాల్ప‌డింది. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ స‌హా అక్క‌డ ప‌ని చేసే మ‌నుషులంద‌రికీ మత్తు మందు ఇచ్చి చోరీ చేశారు.

S

Hyderabad | Published On Feb 6, 2026, 2.27 pm IST

Hyderabad | ప‌ని మ‌నుషుల‌కు మ‌త్తు మందు ఇచ్చి.. రూ. 20 ల‌క్ష‌లు చోరీ..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి రోజు ఏదో ఒక చోట చోరీలు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో నేపాలీ ముఠా భారీ చోరీకి పాల్ప‌డింది. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ స‌హా అక్క‌డ ప‌ని చేసే మ‌నుషులంద‌రికీ మత్తు మందు ఇచ్చి చోరీ చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ నంద‌గిరిహిల్స్‌లోని ఓ ఇంట్లో నేపాల్‌కు చెందిన భువ‌న్ అనే వ్య‌క్తి 15 రోజుల క్రితం వంట మ‌నిషిగా చేరాడు. త‌న పుట్టిన రోజంటూ.. వాచ్‌మెన్ స‌హా అక్క‌డ ప‌ని చేసే వారంద‌రికీ కూల్ డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి ఇచ్చాడు. అంద‌రూ అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిన త‌ర్వాత‌.. మ‌రో ముగ్గురు నేపాలీల‌తో క‌లిసి భువ‌న్ చోరీకి పాల్ప‌డ్డాడు. ఇంట్లోని బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గ‌దును అప‌హ‌రించారు. అయితే ఇంటి య‌జ‌మానులు లేని స‌మ‌యంలో భువ‌న్ ఈ చోరీకి పాల్ప‌డ్డాడు.

బాధిత య‌జ‌మాని ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. 20 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. భువ‌న్ గ్యాంగ్‌ను ప‌ట్టుకునేందుకు పోలీసులు య‌త్నిస్తున్నారు.

Advertisement
Advertisement