త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | చారిత్ర‌క సంప‌ద‌కు హైద‌రాబాద్‌ నెల‌వు.. కోకాపేట‌లో 180 ఏండ్లనాటి బావి

Hyderabad | హైద‌రాబాద్‌ (Hyderabad).. ఒక చ‌రిత్ర‌. చార్మినార్‌, గోల్కొండ కోట‌, కుతుబ్‌షాహీ టూంబ్స్ (Qutb Shahi Tombs), పురానాపూల్‌, ఉస్మానియా ద‌వాఖాన‌, ఆర్ట్స్ కాలేజీ, బ‌న్సీలాల్‌పేట మెట్ల బావి.. ఇలా ఒక్క‌టేమిటి చారిత్ర‌క, వార‌స‌త్వ సంప‌ద‌కు ఇక్క‌డ కొదువ లేదు.

G

Hyderabad | Published On Feb 5, 2026, 7.49 am IST

Hyderabad | చారిత్ర‌క సంప‌ద‌కు హైద‌రాబాద్‌ నెల‌వు.. కోకాపేట‌లో 180 ఏండ్లనాటి బావి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌ (Hyderabad).. ఒక చ‌రిత్ర‌. చార్మినార్‌, గోల్కొండ కోట‌, కుతుబ్‌షాహీ టూంబ్స్ (Qutb Shahi Tombs), పురానాపూల్‌, ఉస్మానియా ద‌వాఖాన‌, ఆర్ట్స్ కాలేజీ, బ‌న్సీలాల్‌పేట మెట్ల బావి.. ఇలా ఒక్క‌టేమిటి చారిత్ర‌క, వార‌స‌త్వ సంప‌ద‌కు ఇక్క‌డ కొదువ లేదు. పుర‌తాన బావులు, క‌ట్ట‌డాల‌కు భాగ్య‌న‌గ‌రం నెల‌వు. తాజాగా మ‌రో పురాత‌న బావి వెలుగులోకి వ‌చ్చింది. ఐటీ కంపెనీల‌కు అడ్డ‌, ఆకాశాన్నంటే బిల్డింగులు కాంతులీనుతున్న‌ కోకాపేట‌లో (Kokapet) 180 ఏండ్లకుపైగా చ‌రిత్ర క‌లిగిన బావి ఇప్ప‌టికీ త‌న అస్తిత్వాన్ని కోల్పోలేదు. ఈ ఒక్క‌టే కాదు, మ‌రో మూడు కూడా ఉన్నాయ‌ని స్థానికులు అంటున్నారు.

కోకాపేట‌లో 180 ఏంళ్లకు పైగా చరిత్రగల మెట్లబావి నడిరోడ్డుపై ఉన్నా దాని ఆనవాళ్లు చెదిరిపోలేదు. పర్యావరణవేత్తలు, వాననీటి సంరక్షణ ఉద్యమకారులు దాన్ని సంరక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఈ ఒక్క బావే కాదు గోశాలలో మరో మూడు బావులు ఇప్పటికీ చెక్కుచెద‌ర‌కుండా అలాగే ఉన్నాయి. ఆకాశాన్ని తాకేలా 50-60 అంతస్థుల భవనాలను నిర్మిస్తున్న కోకాపేటలో.. నీటికోసం పాట్లు పడుతున్న పరిస్థితి నెల‌కొన్న‌ది. భూగర్భ జలాలు అడుగంటిపోతుండ‌టంతో స్వచ్ఛంద సంస్థలు గోశాలలో ఉన్న నాలుగు బావులను సంరక్షిస్తున్నారు.

ఇందులో ఒక బావి హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన గోల్డెన్‌ మైల్ లేఅవుట్‌లో రోడ్డు మధ్యలో ఉంది. 14 ఏండ్లుగా వర్షపు నీరు ఆ బావిలోకి చేరేలా ఏర్పాట్లు చేసి వాటిని గోవులకు వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో గోల్డెన్‌ మైల్‌ లేఅవుట్‌ రోడ్డు 4 వరుసలతో ఉండాల్సిన చోట బావి కారణంగా రెండు లేన్ల‌ రోడ్డుగా మారింది. ఇరువైపుల నుంచి వాహనాల రాకపోకలు పెరగడంతో బావిని సంరక్షిస్తూనే రోడ్డును 4 వరుసలుగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా బావిపై నుంచి వంతెన నిర్మించాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement