త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yash | రామాయణ’లో రావణుడి కాస్ట్యూమ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యష్..!

P

Entertainment | Published On Apr 17, 2026, 7.28 pm IST

Yash | రామాయణ’లో రావణుడి కాస్ట్యూమ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యష్..!
Advertisement

Yash | ప్ర‌ముఖ క‌న్న‌డ స్టార్ న‌టుడు య‌శ్ న‌టిస్తున్న చిత్రం రామాయ‌ణ‌పై రోజురోజుకు ఆస‌క్తి పెరుగుతోంది. ఈ మూవీలో యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా త‌న పాత్రకు సంబంధించిన అనుభవాలు, సవాళ్లపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. సినిమాకాన్ వేడుక‌లో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా చిత్రబృందం రూపొందించిన రావణుడి కాస్ట్యూమ్‌ను ప్రదర్శించారు. ఇందులో భారీ బంగారు కిరీటం, భుజాలకు ప్రత్యేక కవచాలు, చేతి అలంక‌ర‌ణ ఆభ‌ర‌ణాలున్నాయి.

రావణుడి పాత్ర‌పై య‌శ్ మాట్లాడుతూ ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి పాత్ర చేయలేదని తెలిపాడు. ముఖ్యంగా ఆ కాస్ట్యూమ్, కిరీటం చాలా బరువుగా ఉన్నాయని, నిజమైన లుక్ కోసం డిజైన్ చేయడంతో మరింత భారంగా ఉంద‌న్నారు. షూటింగ్ సమయంలో కొన్ని సార్లు దాన్ని తీసేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, ఆ అనుభవం ఎంతో ప్రత్యేకంగా అనిపించింద‌ని చెప్పాడు. కాస్ట్యూమ్ ధరించినప్పుడే పాత్రలోకి వెళ్తాన‌ని, కెమెరా ముందు నిలబడినప్పుడు మాత్రమే నిజంగా ఆ పాత్రను ఎంజాయ్ చేయ‌గ‌ల‌న‌ని పేర్కొన్నాడు.

రావణుడి పది తలల రూపాన్ని చిత్రంలో ఎలా చూపించారనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. దాన్ని కొత్తగా, ప్రత్యేకంగా తెరకెక్కించామని, ఇప్పుడే ఆ విషయం వెల్లడించలేనని తెలిపాడు. ప్రేక్షకులకు ఆ సీన్ ఆసక్తికర అంశాల్లో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నాడు. ‘రామాయణ’ చిత్ర విడుదల విషయానికి వస్తే.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోలో రావణుడి గ్లింప్స్ చూపించినప్పటికీ పూర్తి లుక్‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. త్వరలోనే రావణుడి ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది దీపావ‌ళి పండుగ న‌వంబ‌ర్ 6న ఉండ‌గా.. ఈ చిత్రం అక్టోబ‌ర్ నెలాఖ‌రులో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు.

Advertisement
Advertisement