త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | నిర్మాతగా గొర్రెల కాపరి – కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో సినిమా – ప్ర‌భాస్ టైటిల్‌తో రిలీజ్‌…

ఓ సాధార‌ణ గొర్రెల కాప‌రి నిర్మాత‌గా మారారు. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఓ తెలుగు మూవీని నిర్మించారు. స్పిరిట్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా మే 8న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

N

Entertainment | Published On Apr 28, 2026, 6.06 pm IST

Tollywood | నిర్మాతగా గొర్రెల కాపరి – కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో సినిమా – ప్ర‌భాస్ టైటిల్‌తో రిలీజ్‌…
Advertisement

Tollywood |  ఓ సాధార‌ణ గొర్రెల కాప‌రి సినిమా నిర్మాత‌గా మారింది. ఏకంగా కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెలుగు మూవీని నిర్మించింది. స్పిరిట్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఇందులో రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సిహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వం వ‌హించారు. ఒక గొర్రెలు కాచుకునే భార్య భర్తలు చిన్నబోయిన నర్సమ్మ , వెంకటేశ్వర్లు కలిసి ఈ సినిమాను నిర్మించారు. మే 8న స్పిరిట్ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఈ మూవీ ఆడియో లాంఛ్ ఈవెంట్ జ‌రిగింది.

ప్ర‌భాస్ టైటిల్‌...

లాభ‌న‌ష్టాల గురించి ఆలోచించ‌కుండా గొర్రెలు కాచుకునే నర్సమ్మ తన కొడుకుతో సినిమా చేయాలనే క‌ల‌ను స్పిరిట్‌తో నెర‌వేర్చుకుంద‌ని, ఆమె క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కాల‌ని న‌టుడు, నిర్మాత అశోక్ కుమార్ అన్నారు. "స్పిరిట్ అనగానే ప్రభాస్ చేస్తున్న టైటిల్ గుర్తొస్తుంది. కానీ ప్ర‌భాస్ కంటే ముందే న‌ర్స‌మ్మ ఈ టైటిల్‌ను ఎంచుకుంది. క‌ష్ట‌ప‌డి డ‌బ్బు కూడ‌బెట్టుకుంటూ ఈ సినిమాచేయ‌డం అభినంద‌నీయం. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్‌తో సినిమా తీశామ‌ని చెబితే ఆశ్చ‌ర్య‌పోయా" అని ద‌ర్శ‌కుడు వీ స‌ముద్ర పేర్కొన్నారు.

గొర్రెల‌ను అమ్ముకొని....

చిత్ర నిర్మాతలు చిన్నబోయిన నర్సమ్మ, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ' ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ఎన్నో కష్టపడ్డాం. మాకున్న‌ గొర్రెలను అన్ని అమ్ముకొని సినిమా తీశాము.అందరూ నన్ను ఎగతాళి చేసినా వెన‌క‌డుగు వేయ‌లేదు. స‌పోర్ట్ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. అంద‌రిలా సినిమాలా భావించి స్పిరిట్‌ను ఆద‌రించాలి" అని పేర్కొన్నారు. ఈ మూవీకి ఎస్ ఎస్ వెంకటేష్, సంతోష్ కావాలా మ్యూజిక్ అందించారు.

 

 

Advertisement
Advertisement