త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | రంభ ఊర్వ‌శి, మేన‌క టైటిల్‌తో త్రిష తెలుగు మూవీ… స‌గం షూటింగ్ త‌ర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?

త్రిష హీరోయిన్‌గా తెలుగులో ర‌మ్ పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ అప్ప‌ట్లో మొద‌లైంది. రంభ ఊర్వ‌శి మేన‌క అనే టైటిల్‌ను షార్ట్‌క‌ట్ చేసి తెర‌కెక్కించిన ఈ సినిమాలో త్రిష‌తో పాటు ఛార్మీ, ఇషా చావ్లా, నికీషా ప‌టేల్ లను హీరోయిన్లుగా అనుకున్నారు. స‌గం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయింది....

N

Entertainment | Published On Apr 5, 2026, 7.21 pm IST

Trisha | రంభ ఊర్వ‌శి, మేన‌క టైటిల్‌తో త్రిష తెలుగు మూవీ… స‌గం షూటింగ్ త‌ర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
Advertisement

Trisha | హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఇర‌వై ఏళ్లు దాటినా త్రిష క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. వ‌ర్షం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష ఎన్నో పెద్ద విజ‌యాల‌ను అందుకుంది. ఓ వైపు స్టార్ హీరోల‌తో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే అడ‌పాద‌డ‌పా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు క‌లిసివ‌చ్చినంత‌గా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చెన్నై క్వీన్‌కు అచ్చిరాలేదు. త్రిష న‌టించిన ప‌లు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు డిజాస్ట‌ర్లుగానే మిగిలాయి. మ‌రికొన్ని షూటింగ్ మ‌ధ్య‌లోనే ఆగిపోయాయి.అందులో ర‌మ్ ఒక‌టి..

రంభ ఊర్వ‌శి మేన‌క‌...

రంభ ఊర్వ‌శి మేన‌క అనే టైటిల్‌ను షార్ట్‌గా చేసి ఈ సినిమాకు ర‌మ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో పాటు నిర్మాత‌గా ప‌లు సూప‌ర్ హిట్ సినిమాలు చేసిన ఎమ్ఎస్ రాజు స్వీయ‌ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా లాంఛ్ అయ్యింది. ఇందులో త్రిష‌తో పాటు ఇషాచావ్లా, నికీషాప‌టేల్‌, ఛార్మీలను హీరోయిన్లుగా తీసుకున్నారు.

మూడు భాష‌ల్లో...

యాక్ష‌న్ క‌థాంశంతో ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ క‌థ‌ను రెడీ చేసుకున్నారు ఎమ్ఎస్ రాజు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించిన ఈ సినిమాను తెలుగుతో పాటు క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.
దుబాయ్‌లో ఎడారి బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు హీరోయిన్ల‌పై కొన్ని స‌న్నివేశాలు షూట్ చేశారు. ఇండియాలోనూ ఓ రెండు ఎపిసోడ్స్ చిత్రీక‌ర‌ణ జ‌రిపారు.

డేట్స్ స‌ర్ధుబాటు కాక‌...

క‌థ విష‌యంలో అంత‌గా సంతృప్తి లేక‌పోవ‌డంతో షూటింగ్ మ‌ధ్య‌లోనే ర‌మ్ సినిమాను ద‌ర్శ‌క‌నిర్మాత‌ ఎమ్ఎస్ రాజు ఆపేశారు. కొద్ది రోజుల త‌ర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించాల‌ని ఎంఎస్‌రాజు అనుకున్నారు. కానీ త్రిషతో పాటు ఇషాచావ్లా , నికీషా ప‌టేల్ డేట్స్ ఒకే సారి స‌ర్ధుబాటు చేయ‌డం క‌ష్ట‌మైంది. దాంతో ర‌మ్ సినిమాను పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశారు.

చిరంజీవి విశ్వంభ‌ర‌...

ప్ర‌స్తుతం త్రిష తెలుగులో విశ్వంభ‌ర సినిమా చేస్తోంది. చిరంజీవి హీరోగా న‌టించిన ఈ సోషియా ఫాంట‌సీ మూవీకి వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. కానీ వీఎఫ్ఎక్స్‌, గ్రాఫిక్స్ విష‌యంలో విమ‌ర్శ‌లు రావ‌డంతో వాయిదావేశారు.

Advertisement
Advertisement