త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Trisha | పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌లుగా హాజ‌రైన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష – ఆ మూవీ ఏదంటే?

గ‌తంలో ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష జంట‌గా ప‌లు సినిమా ఈవెంట్‌ల‌కు హాజ‌ర‌య్యారు. అందులో ఓ తెలుగు మూవీ కూడా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఓ తెలుగు మూవీ ఆడియో లాంఛ్ వేడుక‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష చీఫ్ గెస్ట్‌లుగా అటెండ్ అయ్యారు. ఆ సినిమా ఏదంటే?

N

Entertainment | Published On Apr 24, 2026, 5.22 pm IST

Vijay Trisha | పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్‌కు చీఫ్‌ గెస్ట్‌లుగా హాజ‌రైన‌ ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష – ఆ మూవీ ఏదంటే?
Advertisement

Vijay Trisha |  ద‌ళ‌ప‌తి విజ‌య్, త్రిష బంధంపై గ‌త కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో అనేక రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. ద‌ళ‌ప‌తి విజ‌య్ నుంచి విడాకులు కావాలంటూ అత‌డి భార్య సంగీత ఇటీవ‌లే కోర్టులో కేసు వేసింది. విజ‌య్‌కి ఓ న‌టితో గ‌త ఐదేళ్లుగా వివాహేత‌ర సంబంధం ఉంద‌ని ఆరోపించింది. ఆ న‌టి త్రిష‌నే అంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే విజ‌య్‌తో క‌లిసి త్రిష ఓ వెడ్డింగ్ ఫంక్ష‌న్‌కు అటెండ్ కావ‌డంతో ఈ రూమ‌ర్లు నిజ‌మేనంటూ అభిమానులు ఫిక్స‌య్యారు. సంగీతతో విడాకులు వ్య‌వ‌హారం ముగియ‌గానే త్రిష‌ను విజ‌య్ పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు త‌మిళ‌నాట జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.
కాగా ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష జంట‌గా గ‌తంలో ప‌లు సినిమా వేడుక‌ల‌కు అటెండ్ అయ్యారు. అందులో ఓ తెలుగు మూవీ కూడా ఉంది. అదీ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన సినిమా కావ‌డం గ‌మ‌నార్హం.

ఆడియో లాంఛ్ ఈవెంట్‌...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ ధ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో బంగారం పేరుతో ఓ యాక్ష‌న్ కామెడీ మూవీ రూపొందింది. మీరా చోప్రా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను తెలుగులో ఏఎమ్ ర‌త్నం నిర్మించారు. బంగారం ఆడియో లాంఛ్‌ వేడుక‌ను హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా మేక‌ర్స్ నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష చీఫ్ గెస్ట్‌లుగా అటెండ్ అయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ వేడుక‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష రావ‌డం అప్ప‌ట్లో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ప‌వన్‌పై అభిమానంతో...

డైరెక్ట‌ర్ ధ‌ర‌ణితో ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి మంచి అనుబంధం ఉంది. ధ‌ర‌ణి డైరెక్ష‌న్‌లో గిల్లీ, కురివి సినిమాలు చేశారు విజ‌య్‌. ద‌ర్శ‌కుడితో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఉన్న అభిమానంతో బంగారం ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు త్రిష‌తో క‌లిసి విజ‌య్ అటెండ్ అయిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

నాలుగేళ్ల‌లో నాలుగు సినిమాలు...

బంగారం మూవీ రిలీజ్ టైమ్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్‌, త్రిష జోడీ కోలీవుడ్‌లో హిట్‌పెయిర్‌గా కొన‌సాగుతోన్నారు. నాలుగేళ్ల గ్యాప్‌లోనే ఏడాదికి ఓ సినిమా చొప్పున జంట‌గా నాలుగు సినిమాలు చేశారు. విజ‌య్‌, త్రిష కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌ వ‌చ్చిన గిల్లీ (2004), తిరుపాచి (2005), ఆది (2006), కురువి (2008) బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. కురివి త‌ర్వాత ప‌దిహేనేళ్ల పాటు ఈ జంట సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన లియోతో లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ జోడీ క‌ట్టారు.

 

Advertisement
Advertisement