Funky Review | ఫంకీ మూవీ రివ్యూ – విశ్వక్‌సేన్‌కు జాతిరత్నాలు డైరెక్టర్ హిట్టిచ్చాడా? లేదా? అంటే…
విశ్వక్‌సేన్, అనుదీప్ కాంబినేషన్‌లో రూపొందిన ఫంకీ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఫంకీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Feb 13, 2026, 12.06 pm IST
Funky Review | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ (Vishwak sen) హిట్టు అందుకొని చాలా రోజులే అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో అతడు చేసిన గత సినిమాలు సరైన ఫలితాలను అందుకోలేదు. సక్సెస్ కోసం ఈ సారి ఔట్ అండ్ ఔట్ కామెడీ కథను ఎంచుకొని ఫంకీ (Funky Movie Review) సినిమా చేశాడు విశ్వక్‌సేన్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 13న (నేడు) థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? ఫంకీతో విశ్వక్‌సేన్‌తో పాటు డైరెక్టర్ అనుదీప్‌కు హిట్టు దక్కిందా? లేదా? అంటే?
కోమల్ సినిమా కష్టాలు...
కోమల్ (విశ్వక్‌సేన్) డైరెక్టర్. ఫంకీ పేరుతో డెబ్యూ సినిమా తీస్తుంటాడు. నాలుగు కోట్ల బడ్జెట్ అని చెప్పి సినిమా కంప్లీట్ కాకముందే ప్రొడ్యూసర్ సుదర్శన్ (నరేష్) చేత నలభై కోట్లు ఖర్చుపెట్టిస్తాడు. మిగిలిన షూటింగ్ కోసం నాలుగు కోట్లు అవసరమని కోమల్ అనడంతో అతడిని పక్కనపెట్టి తక్కువ బడ్జెట్‌లో మరో డైరెక్టర్‌తో సినిమాను పూర్తి చేయాలని ప్రయత్నిస్తాడు సుదర్శన్. కానీ ఎవరూ ముందుకు రారు. బడ్జెట్ తగ్గించి కోటి రూపాయలలోపే సినిమాను పూర్తిచేయాలని సుదర్శన్ కూతురు చిత్ర (కయదు లోహర్) కోమల్‌కు కండీషన్ పెడుతుంది. చిత్ర చెప్పిన బడ్జెట్‌లోనే కోమల్ సినిమా కంప్లీట్ చేశాడా? ఈ జర్నీలో చిత్రతో ప్రేమలో పడ్డ కోమల్ తన లవ్‌ను ఆమెకు వ్యక్తం చేశాడా? ఎమోషన్స్ అంటే తెలియని కోమల్ ప్రపోజల్‌ను చిత్ర అంగీకరించిందా? కోమల్ సినిమాను ఆపడానికి ప్రయత్నించిన జీకే (సంపత్) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
నో లాజిక్స్....
ఫంకీ టైటిల్‌కు తగ్గట్లే ఇదొక ఫన్నీ మూవీ. భారీ కథ, ఎమోషన్స్, సెంటిమెంట్, లాజిక్‌లు ఏం ఉండవని ప్రమోషన్స్‌లోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కేవలం నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్లకు రావాలని ఫుల్‌గా ఆడియెన్స్‌ను ప్రిపేర్ చేశారు. దర్శకనిర్మాతల మాటలు తగ్గట్లే ఈ సినిమా ఉంది.
రొటీన్‌కు భిన్నంగా....
ఓ యంగ్ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూతురు ఎలా ప్రేమలో పడ్డారు అన్నదే ఈ మూవీ కథ. ఈ సింపుల్ పాయింట్‌ను రెండు గంటలు ఎంటర్‌టైనింగ్‌గా చెప్పారు దర్శకుడు అనుదీప్ కేవీ. సాధారణంగా లవ్‌స్టోరీస్‌లో హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం, వారి ప్రేమకథలో అవాంతరాలు ఏర్పడి విడిపోవడం, ఆ జంట ఎదుర్కొనే సంఘర్షణను ...చాలా ఎమోషనల్‌గా చూపిస్తుంటారు. కానీ ఇది అలాంటి ఫంకీ అలాంటి లవ్‌కాదు. రొటీన్ టైప్ ప్రేమకథలు తనకు గలీజ్ అనిపిస్తాయని విశ్వక్‌సేన్ క్యారెక్టర్‌తో డైరెక్టర్ హింట్ ఇచ్చేశాడు. లవ్‌స్టోరీ చాలా సరదాగా సాగిపోతుంది. ఎక్కడ ఓవర్ మెలో డ్రామా ఉండదు. ఫోర్స్‌డ్ డైలాగ్స్, సినిమాటిక్ సీన్స్ కనిపించవు. ప్రతి సీన్, డైలాగ్ కామెడీని జనరేట్ చేస్తూనే లవ్‌స్టోరీని నడిపించిన విధానం బాగుంది.
ఇండస్ట్రీపై సెటైర్లు...
సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో కథను నడిపించడం ఫంకీకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఇండస్ట్రీపై ఈ సినిమాలో చాలానే సెటైర్లు వేశారు. మైథలాజికల్ ట్రెండ్ గురించి దిల్‌రాజు వేసిన పంచ్, సీక్వెల్ సినిమాల విషయంలో హరీష్ శంకర్ సెటైర్లు నవ్వించాయి. వీరిద్దరినే కాకుండా ఓ సీన్ కోసం ఫంకీ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీని కూడా వాడుకున్నాడు డైరెక్టర్. బడ్జెట్ విషయంలో డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు ఎలాంటి అభిప్రాయభేదాలు వస్తాయి? ఛాన్స్‌ల కోసం కొత్త డైరెక్టర్లు పడే ఇబ్బందులతో పాటు ప్రొడ్యూసర్ల కష్టాలు, ఇండస్ట్రీ తీరుతెన్నుల గురించి మెసేజ్ ఇస్తున్నట్లుగా కాకుండా కామెడీగానే చూపించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లకు వెళ్లి పాసులు లేకుండా ఫ్యాన్స్ దెబ్బలు తినడం ఫన్నీగా రీక్రియేట్ చేశారు.
చివరలో ఎమోషనల్ టచ్....
ఓవర్ బడ్జెట్ కారణంగా కోమల్‌ను ప్రొడ్యూసర్ సుదర్శన్ పక్కనపెట్టడం, చిత్రను మెప్పించి తిరిగి డైరెక్టర్‌గా కోమల్ సినిమాను మొదలుపెట్టడం లాంటి సీన్లతో ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్‌లా సాగుతోంది. విలన్ జీకే ఎంట్రీ కోమల్ లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, అదే టైమ్‌లో చిత్ర అతడిని ద్వేషించుకునే సీన్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. తన సినిమా కంప్లీట్ చేయడానికి కోమల్ వేసే ప్లాన్స్.... చిత్రను ఇంప్రెస్ చేయడానికి పడే తాపత్రయం ద్వితీయార్థంలో నవ్విస్తాయి. కొడుకుగా తన బాధ్యతలు నెరవేర్చడం ఏం చేశాడన్నది చూపించే సీన్‌తో ప్రీ క్లైమాక్స్‌లో చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చారు డైరెక్టర్.
వన్ లైనర్స్...
ఫన్నీ అనుదీప్ రాసిన వన్ లైనర్స్ చాలా చోట్ల పేలాయి. కొన్ని చోట్ల అవే డ్రాబ్యాక్ అయ్యాయి. ఆ కామెడీ ఫ్లో కంటిన్యూగా సాగలేదు.జీకే ఎపిసోట్‌లో అటు సీరియస్‌నెస్, ఇటు కామెడీ రెండు మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.
కామెడీ టైమింగ్....
విశ్వక్‌సేన్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషన్స్ లేని కుర్రాడి పాత్రకు తగ్గట్లుగా కనిపించాడు. చిత్ర పాత్రలో కయదు లోహర్ యాక్టింగ్ బాగుంది. పాటల్లో గ్లామర్‌తో పాటు డ్యాన్సులతో అదరగొట్టింది. నరేష్, సంపత్, పమ్మీ సాయిలోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదు. డైరెక్టర్ అనుదీప్ తో పాటు మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఇందులో గెస్ట్‌గా కనిపించాడు. జతిరత్నాలు సినిమాను పోలి వీరి క్యారెక్టర్లు సాగుతాయి. భీమ్స్ పాటలు ధీరే ధీరే సాంగ్ బాగుంది.
ఫంకీ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ మూవీ. స్టోరీ, లాజిక్స్ లాంటివి పక్కనపెట్టి చూస్తే ఎంటర్‌టైన్ చేస్తుంది. జాతిరత్నాలు స్థాయిలో మాత్రం నవ్వించలేకపోయింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



