Vishwak Sen | సూపర్ సినిమా తీశానని సీఎం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటారు – కల్ట్‌పై విశ్వక్‌సేన్ కామెంట్స్
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కల్ట్ మూవీ టీజర్ శనివారం రిలీజైంది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు విశ్వక్‌సేన్. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు.
Entertainment | Published On Feb 21, 2026, 6.50 pm IST
Vishwak Sen | ఇటీవలే ఫంకీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విశ్వక్‌సేన్. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఫంకీ తర్వాత కల్ట్ పేరుతో ఓ స్లాషర్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు ఇందులో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కల్ట్‌కు కథ, స్క్రీన్‌ప్లే కూడా విశ్వక్‌సేన్ అందించాడు.
బ్లడ్ బాత్...
కల్ట్ మూవీ టీజర్ శనివారం రిలీజైంది. రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలతో ఈ టీజర్ సాగింది. ఓ పార్టీ కోసం గోవాకు వచ్చిన ముగ్గురు స్నేహితులకు అక్కడ ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? కల్ట్ అనే పార్టీలో జరిగిన రక్త పాతాన్ని ఓ యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాలతో టీజర్ సాగింది. ఇందులో గేమ్ మాస్టర్‌గా విశ్వక్‌సేన్ మాస్ రోల్‌లో కనిపించారు. యాక్షన్ సన్నివేశాలతో ఈ టీజర్ బ్లడ్‌బాత్‌లా ఉంది.
సీఏం మెచ్చుకుంటారు...
ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో "డ్రగ్స్ వినియోగించే సీన్లు సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి....డ్రగ్స్‌ను ప్రోత్సహించే సినిమాలు తీయడం అవసరమా" అనే ప్రశ్నపై విశ్వక్‌సేన్ ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్ చెప్పాడు. డ్రగ్స్ వాడకాన్ని తన సినిమాల్లో ఎంకరేజ్ చేయనని అన్నాడు. "కల్ట్ సినిమా చూస్తే సీఎం రేవంత్ రెడ్డిగారు కూడా పిలిచి సూపర్ సినిమా తీశావని" అంటారు అని విశ్వక్‌సేన్ బదులిచ్చాడు. తాను ఏ ఇంటెన్షన్‌తో సినిమా తీశానన్నది రిలీజ్ తర్వాత అందరికి అర్థమవుతుంది అని విశ్వక్ సేన్ చెప్పాడు. నాలుగున్నరేళ్లు కష్టపడి ఈ కథను రాసుకొని కల్ట్ సినిమా చేశానని విశ్వక్‌సేన్ పేర్కొన్నాడు.
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్...
టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కల్ట్ మూవీకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో రవి బస్రూర్ కాళ్లు మొక్కాడు విశ్వక్‌సేన్. "పాతికేళ్ల సినీ ప్రయాణంలోని నాలోని సంగీత దర్శకుడిని మాత్రమే కాకుండా నా అంతరాత్మను పూర్తిగా చదివిన వ్యక్తి విశ్వక్‌సేన్" అంటూ రవి బస్రూర్ అన్నారు. అతడి మాటలకు ఎమోషనల్ అయిన విశ్వక్‌సేన్ రవి బస్రూర్ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. కల్ట్ మూవీకి రవి బస్రూర్ అందించిన మ్యూజిక్‌కు విశ్వక్‌సేన్ ఇంప్రెస్ అయ్యాడు. అతడికి రోలెక్స్ గోల్స్ వాచ్‌ను గిఫ్ట్‌గా టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో ప్రజెంట్ చేశాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



