Vijay Rashmika Wedding | విజయ్, రష్మిక పెళ్లి ఎప్పుడంటే? – అనుకున్న డేట్ కంటే ముందుగానే!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి డేట్ మారినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 26న కాకుండా ఫిబ్రవరి 2నే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Feb 1, 2026, 1.47 pm IST
Vijay Rashmika Wedding | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పెళ్లి వార్తలను ఇప్పటివరకు విజయ్, రష్మికతో పాటు వారి కుటుంబసభ్యులు కన్ఫామ్ చేయలేదు. తాజాగా విజయ్, రష్మిక పెళ్లి డేట్ మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న కాకుండా ఫిబ్రవరి 2వ తేదీనే ఈ జోడీ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు చెబుతోన్నారు.
సిటీ ప్యాలెస్లో...
తాన్య అనే ఇన్ప్లూయెన్సర్ రిలీజ్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఫిబ్రవరి 2న రాజస్థాన్ ఉదయ్పూర్లోని సిటీ ప్యాలెస్లో విజయ్, రష్మిక పెళ్లి జరుగనున్నట్లు తాన్య తెలిపింది. తాన్య పోస్ట్ చేసిన వీడియోలో ప్యాలెస్ మొత్తం పూలతో అందంగా అలకరించి కనిపించింది. డెకరేషన్ పనులు పెద్ద ఎత్తున జరుగుతోన్నాయి. విజయ్, రష్మిక పెళ్లి ఏర్పాట్లు ఇవనీ తెలిపింది.
ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. పలువురు నెటిజన్లు ఫిబ్రవరి 2న పెళ్లి జరుగనుంది నిజమేనని అంటున్నారు. విజయ్, రష్మికలకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరికొందరు మాత్రం రీచ్ కోసం పెట్టిన వీడియో ఇదని కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి వార్తలపై గతంలో విజయ్, రష్మిక రియాక్ట్ అయ్యారు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే దీనిపై స్పందిస్తామని అన్నారు.
రణబాలి...
విజయ్, రష్మిక కలిసి తెలుగులో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు రణబాలి అనే పేరును ఖరారు చేశారు. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జయమ్మ అనే పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



