Vijay Rashmika | సొంత ఊరిలో భార్య రష్మికతో కలిసి విజయ్ దేవరకొండ వ్రతం – ఫొటోలు వైరల్
నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకున్నారు. విజయ్ దేవరకొండ సొంత ఊరు తుమ్మన్‌పేటలో ఈ వ్రతం జరిగింది. ఈ పూజ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Mar 2, 2026, 2.23 pm IST
Vijay Rashmika సాధారణంగా సినిమా స్టార్స్ పెళ్లి తర్వాత హనీమూన్ కోసం విదేశాలకు వెళుతుంటారు. హిల్ స్టేషన్స్, మంచు ప్రదేశాలకు వెకేషన్ ప్లాన్ చేస్తుంటారు. కానీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మాత్రం పెళ్లి తర్వాత పాటించాల్సిన సంప్రదాయాలన్నీ ఫాలో అవుతున్నారు. నేటి తరానికి మన సంప్రదాయాలు, ఆచారాల విలువను చాటిచెబుతున్నారు. ఇటీవలే విజయ్, రష్మిక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. హైదరాబాద్‌లో మార్చి 4న రిసెప్షన్ ప్లాన్ చేశారు.
తుమ్మన్ పేట....
రిసెప్షన్ కంటే ముందు విజయ్ భార్య రష్మికతో కలిసి తన సొంత ఊరు నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేటకు వచ్చారు. సోమవారం తుమ్మన్‌పేటలో విజయ్‌దేవరకొండ, రష్మిక మందన్న కలిసి సత్యనారాయణ స్వామి వత్రం జరుపుకున్నారు. ఈ వ్రతంలో కంప్లీట్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో విజయ్, రష్మిక కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
ఘన స్వాగతం...
తుమ్మన్‌పేటలోని విజయ్ దేవరకొండ ఫామ్‌హౌజ్‌లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. ఇక్కడే గ్రామ ప్రజల కోసం విజయ్ ప్రత్యేకంగా రిసెప్షన్ కూడా ఏర్పాటుచేసినట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు దాదాపు ఐదు వేల మంది హాజరుకానున్నట్లు చెబుతోన్నారు. సోమవారం ఉదయం తుమ్మన్‌పేటకు వచ్చిన విజయ్, రష్మికలకు గ్రామ ప్రజలు సాదరంగా స్వాగతం పలికారు. డప్పులు, డ్యాన్సులతో ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
సినీ ప్రముఖులు
విజయ్, రష్మిక రిసెప్షన్ హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో జరుగనుంది. ఈ వేడుకకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు అటెండ్ కానున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇన్విటేషన్ ఉన్నవారికే లోపలికి ఆహ్వానిస్తామని ప్రకటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



