Urvashi Rautela | గ్లామర్‌ఇమేజ్‌కు భిన్నంగా పూనమ్‌మిశ్రా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఊర్వశి రౌటెలా..!
Urvashi Rautela | బాలీవుడ్‌నటి ఊర్వశి రౌతేలా మరోసారి ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ వెబ్ సిరీస్ నయా సీజన్‌లో పూనమ్ మిశ్రా పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఆమె తన పాత్రతో పాటు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సాధారణంగా తనపై ‘గ్లామర్ ఇమేజ్’ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉందని ఊర్వశి తెలిపింది.
Entertainment | Published On May 13, 2026, 8.30 pm IST
Urvashi Rautela | బాలీవుడ్‌నటి ఊర్వశి రౌతేలా మరోసారి ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ వెబ్ సిరీస్ నయా సీజన్‌లో పూనమ్ మిశ్రా పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో ఆమె తన పాత్రతో పాటు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సాధారణంగా తనపై ‘గ్లామర్ ఇమేజ్’ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉందని ఊర్వశి తెలిపింది. అయితే, ఈ సిరీస్‌లో మాత్రం ఆ ఇమేజ్‌కు భిన్నంగా, సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలో కనిపించాల్సి వచ్చిందని తెలిపింది. ‘నిజంగా ఎదగాలనుకునే నటీనటులు ఒక దశలో తనలోని పెర్ఫార్మెన్స్ వానిటీని వదిలేయాల్సి ఉంటుంది. ప్రతి ఫ్రేమ్‌లో పర్ఫెక్ట్‌గా కనిపించాలనే ఒత్తిడి కారణంగా గ్లామర్‌ఇమేజ్‌తో వస్తుంది’ పేర్కొంది. ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్’ లాంటి ప్రాజెక్టులు విజువల్ పర్ఫెక్షన్ కంటే భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయని ఊర్వశి స్పష్టం చెప్పుకొచ్చింది.
ఈ పాత్ర కోసం తాను ప్రత్యేకంగా నేర్చుకున్నది ‘కనపడాలనే ఆలోచనను పక్కన పెట్టి, ఆ క్షణంలో రియాలిటీగా ఉండడం’ అని పేర్కొంది. ‘నిజ జీవితంలో మనుషులు ప్రతి క్షణం ఎలా కనిపిస్తున్నామనే ఆలోచనతో ఉండరు. వారు పరిస్థితులకు స్పందిస్తారు. అదే సహజత్వాన్ని తెరపైకి తీసుకురావడం నాకు కీలకంగా అనిపించింది’ అని చెప్పింది. నటనలో నియంత్రణ కూడా కఠినమైందేనని ఊర్వశి అభిప్రాయం వ్యక్తం చేసింది. అతి భావోద్వేగాల కంటే మౌనం, నియంత్రిత ప్రతిస్పందనలు చాలా కష్టమని తెలిపింది. కొన్నిసార్లు తక్కువగా చేయడమే ఎక్కువ నిజాయితీని కోరుకుంటుందని పేర్కొంది. ఈ అనుభవం తనకు ఒక నటిగా కొత్త స్వేచ్ఛను ఇచ్చిందని, పాత్రలో మరింత లోతుగా వెళ్లేందుకు అవకాశం కలిగిందని పేర్కొంది.
ఇన్‌స్పెక్టర్ అవినాష్ సిరీస్ 2023లో మొదలైంది. రణదీప్ హుడా ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌ఉత్తరప్రదేశ్‌లో క్రైమ్‌ను అరికట్టేందుకు నియామకమైన ఐపీఎస్ అధికారి అవినాష్ మిశ్రా జీవిత కథ ఆధారంగా రూపొందించారు. తొలి సీజన్‌లో అమిత్ సియాల్, శాలిన్ భనోట్, రాహుల్ మిత్రా, జాకిర్ హుస్సేన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఊర్వశి సినిమాల విషయానికి వస్తే చివరగా నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహరాజ్‌మూవీలో నటించింది. వీటితో పాటు వెల్‌కం టూ ది జంగిల్‌తో పాటు, కసూర్‌మూవీల్లో నటించనుంది. తెలుగులో బ్లాక్‌రోజ్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ఆలస్యమవుతోంది.
సంబంధిత వార్తలు

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
మే 21, 2026

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
మే 21, 2026

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



