త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Trisha | త్రిష క్రేజ్‌ మాములుగా లేదండోయ్‌..! రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెంచేసింది..!

Trisha | కోలీవుడ్‌లో త్రిష క్రేజ్‌ మరోసారి పీక్స్‌కు చేరింది. తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే త్రిష పేరు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. విజయ్ రాజకీయ ఎంట్రీతో త్రిష పాపులారిటీకి కొత్త ఊపు వచ్చిందని కోలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

P

Entertainment | Published On May 13, 2026, 9.35 pm IST

Trisha | త్రిష క్రేజ్‌ మాములుగా లేదండోయ్‌..! రెమ్యునరేషన్‌ కూడా భారీగా పెంచేసింది..!
Advertisement

Trisha | కోలీవుడ్‌లో త్రిష క్రేజ్‌ మరోసారి పీక్స్‌కు చేరింది. తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే త్రిష పేరు సోషల్ మీడియా, సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. విజయ్ రాజకీయ ఎంట్రీతో త్రిష పాపులారిటీకి కొత్త ఊపు వచ్చిందని కోలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తుందంటూ కొంతకాలంగా ప్రచారం జరిగినప్పటికీ, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె సన్నిహిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటూనే సినిమాలపై పూర్తి దృష్టి పెట్టిన త్రిష ప్రస్తుతం తమిళం, తెలుగు సహా పలు భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

రూ.10కోట్ల దాకా డిమాండ్‌..

తాజాగా చెన్నై బ్యూటీ రెమ్యునరేషన్‌ విషయంలోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు తీసుకున్న త్రిష.. ప్రస్తుతం రూ.10కోట్ల వరకు పెంచినట్లుగా వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఆమెకున్న మార్కెట్‌, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు సైతం అంత మొత్తం ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రిష చేతికి కీలక ప్రాజెక్ట్‌ చిక్కినట్లు సమాచారం. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో కీలక పాత్ర కోసం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రంలో కీలక పాత్ర కోసం ఆమెతో చర్చలు జరుగుతున్నాయని కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ భారీ మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ర‌జ‌నీ మూవీలో ఛాన్స్‌..

ఎన్నో సంవత్సరాల తర్వాత ఇద్దరు స్టార్‌ హీరోలు మళ్లీ ఒకేసారి తెరపై కనిపించనుండడంతో ఈ మూవీపై భారీ హైప్‌నెలకొంది. ఈ మూవీలో కీలకపాత్రలో నటించేందుకు త్రిష గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఆమె కెరీర్‌లో మరో భారీ చిత్రం చేరినట్లేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కమల్‌ హాసన్‌తో ‘మధన్‌ అంబు’, ‘తూంగావనం’, ‘థగ్‌లైఫ్‌’ చిత్రాల్లో నటించిన త్రిష, రజనీకాంత్‌తో ‘పేట్టా’లో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇద్దరు దిగ్గజాలతో ఒకేసారి నటించే అవకాశం రావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం త్రిష సూర్య సరసన కురుప్పు చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ థియేటర్లలోకి రానుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి త్రిష నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రిలీజ్‌కు సిద్ధమైంది. వరుస భారీ ప్రాజెక్టులు, పెరుగుతున్న డిమాండ్‌, భారీ రెమ్యునరేషన్‌తో త్రిష మరోసారి దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement