Ukraine Fires | రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్.. చమురు కేంద్రాల్లో మంటలు
Ukraine Fires | రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఆదివారం రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని చమురు ఎగుమతి టెర్మినల్, చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.
International | Published On Oct 18, 2026, 6.18 pm IST
Ukraine Fires | రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. ఆదివారం రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని చమురు ఎగుమతి టెర్మినల్, చమురు నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. రష్యా రక్షణ శాఖ మాత్రం తమ సైన్యం 15 ప్రాంతాలతో పాటు క్రిమియా ద్వీపకల్పం, నల్ల సముద్రం పరిధిలో మొత్తం 1,015 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద వైమానిక దాడుల్లో ఇదొకటిగా పేర్కొంటున్నారు.
చమురు కేంద్రాలు, డేటా సెంటర్ లక్ష్యంగా..
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని చమురు ఎగుమతి టెర్మినల్, రుచి చమురు నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరగడంతో మంటలు చెలరేగాయి. రష్యాకు చెందిన రిటైల్ సంస్థ ఓజోన్ లాజిస్టిక్స్ కేంద్రం, టెక్నాలజీ సంస్థ వీకే డేటా సెంటర్‌పైనా దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడులను రెండు సంస్థలూ ధ్రువీకరించాయి. సెయింట్ పీటర్స్బర్గ్ గవర్నర్ అలెగ్జాండర్ బెగ్లోవ్ ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడినట్లు వెల్లడించారు. మరోవైపు, ఉక్రెయిన్‌లోని దక్షిణ నగరం జపోరిజ్జియాపై రష్యా రెండు దాడులు చేసింది. ఈ ఘటనల్లో ఓ మహిళ మృతి చెందగా.. కనీసం ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరేళ్ల బాలిక కూడా ఉంది. దాడుల కారణంగా రెండు అపార్ట్మెంట్ భవనాలు, 18 కార్లు, ఓ విద్యాసంస్థ దెబ్బతిన్నాయని ప్రాంతీయ సైనిక పరిపాలన అధిపతి మిఖాయిలో సెమికిన్ తెలిపారు.
ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలన్న ట్రంప్
రష్యా, ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై పరస్పర దాడులు నిలిపివేయడానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 11న ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ ఇరు దేశాల మధ్య ఇంధన కేంద్రాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. మూడు రోజుల విరామం తర్వాత రష్యా చమురు కేంద్రాలపై దాడులను తిరిగి ప్రారంభించినట్లు ఉక్రెయిన్ గురువారం ధ్రువీకరించింది. ట్రంప్ ప్రకటన తర్వాతి వారంలో రష్యా తమ ఇంధన, చమురు, గ్యాస్ రంగాలపై 76 సార్లు దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఆదివారం తెలిపారు. గత రాత్రి నాలుగు ప్రాంతాల్లోని ఇంధన కేంద్రాలపై దాడులు జరిగాయని, వేలాది కుటుంబాలకు ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదని పేర్కొన్నారు.
రష్యాపై ఒత్తిడి పెంచాలి : జెలెన్స్కీ
ఉక్రెయిన్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించడమే లక్ష్యంగా రష్యా దాడులు చేస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. రష్యాపై ఒత్తిడిని మరింత పెంచాలని అమెరికాను కోరారు. ఆంక్షల సడలింపులు, ఒప్పందాలున్నప్పటికీ రష్యా తన వైఖరిని మార్చుకోవడం లేదని విమర్శించారు. యుద్ధం కొనసాగడానికి ఉక్రెయిన్ ఆత్మరక్షణ కారణం కాదని, రష్యా దూకుడు చర్యలే కారణమని పేర్కొన్నారు. శాంతి అవకాశాలు మెరుగుపడాలంటే రష్యాపై ఒత్తిడి తప్పనిసరి అని స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sunil Gavaskar | హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం కష్టమే.. బీసీసీఐ సునీల్ గవాస్కర్ అడ్వైజ్
అక్టోబర్ 18, 2026

Navaratri Brahmotsavam | సూర్యప్రభ వాహనం విహరించిన మలయప్పస్వామి.. పరవశించిన భక్తజనం
అక్టోబర్ 18, 2026

Navratri Special | ఆయుధ పూజ నుంచి ఆత్మనిగ్రహం వరకు.. దసరా చెప్పే జీవన పాఠాలు!
అక్టోబర్ 18, 2026
తాజావార్తలు
- ●BRS Switzerland | పత్రికా స్వేచ్ఛంటే నిరాధార ఆరోపణలు చేసే లైసెన్స్ కాదు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ నేత శ్రీధర్ గందె
- ●Ramayana | హాలీవుడ్ సెలిబ్రిటీల కోసం రామాయణ స్పెషల్ షో - రిలీజ్‌కు పది రోజుల ముందే స్క్రీనింగ్
- ●Sunil Gavaskar | హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం కష్టమే.. బీసీసీఐ సునీల్ గవాస్కర్ అడ్వైజ్
- ●Tata Trusts Not For Profit Hospitals | పేదలకు వరంగా 'టాటా' సంచలన నిర్ణయం: దేశవ్యాప్తంగా 50 లాభాపేక్ష లేని ఆస్పత్రుల నిర్మాణం
- ●BRS Denmark | వెలుగు పత్రిక తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
- ●Sridevi | శ్రీదేవి కోసం చూడాల్సిన సినిమా - "హైకూ"పై కోన వెంకట్ కామెంట్స్

BRS Switzerland | పత్రికా స్వేచ్ఛంటే నిరాధార ఆరోపణలు చేసే లైసెన్స్ కాదు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ శాఖ నేత శ్రీధర్ గందె

Ramayana | హాలీవుడ్ సెలిబ్రిటీల కోసం రామాయణ స్పెషల్ షో - రిలీజ్‌కు పది రోజుల ముందే స్క్రీనింగ్

Sunil Gavaskar | హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం కష్టమే.. బీసీసీఐ సునీల్ గవాస్కర్ అడ్వైజ్

Tata Trusts Not For Profit Hospitals | పేదలకు వరంగా 'టాటా' సంచలన నిర్ణయం: దేశవ్యాప్తంగా 50 లాభాపేక్ష లేని ఆస్పత్రుల నిర్మాణం



