త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Actor Raghunatha Reddy | టాలీవుడ్‌లో విషాదం – సీనియ‌ర్ న‌టుడు ర‌ఘునాథ‌రెడ్డి క‌న్నుమూత‌

టాలీవుడ్ న‌టుడు ర‌ఘునాథ‌రెడ్డి ఆదివారం గుండెపోటుతో క‌న్నుమూశారు. సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో 370కిపైగా సినిమాల్లో వివిధ పాత్ర‌లు చేశారు. ఒరేయ్ రిక్షా, ప్రేమించుకుందాం రా, మ‌ల్లీశ్వ‌రితో పాటు ప‌లు తెలుగు సినిమాలు ర‌ఘ‌నాథ‌రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

N

Entertainment | Published On Feb 1, 2026, 7.14 pm IST

Actor Raghunatha Reddy | టాలీవుడ్‌లో విషాదం – సీనియ‌ర్ న‌టుడు ర‌ఘునాథ‌రెడ్డి క‌న్నుమూత‌
Advertisement

Actor Raghunatha Reddy | టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. సీనియ‌ర్ న‌టుడు ర‌ఘునాథ‌రెడ్డి ఆదివారం గుండెపోటుతో క‌న్నుమూశారు. హైద‌రాబాద్ కుషాయిగూడ‌లోని ప్ర‌థ‌మ‌పురి కాల‌నీలోని స్వ‌గృహంలోనే ఆయ‌న తుది శ్వాస విడిచారు. ర‌ఘునాథ‌రెడ్డి కుమారుడు నెల రోజుల క్రితం క‌న్నుమూశారు. కొడుకు మ‌ర‌ణంతో కొన్నాళ్లుగా ఆయ‌న తీవ్ర మ‌నోవేద‌న‌కు లోనైన‌ట్లు తెలిసింది. ఆ బాధ‌తోనే గుండెపోటుకు గురై మృత్యువాత ప‌డిన‌ట్లు కుటుంబ‌స‌భ్యులు పేర్కొన్నారు.

స‌ర్ప‌యాగంతో ఎంట్రీ...

ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన స‌ర్ప‌యాగం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ఘునాథ‌రెడ్డి తెలుగులో 370 వ‌ర‌కు సినిమాలు చేశాడు. హీరో తండ్రిగా, విల‌న్‌, లాయ‌ర్‌, జ‌డ్జితో పాటు ప‌లు డిఫ‌రెంట్ రోల్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. ఒరేయ్ రిక్షా, ప్రేమించుకుందాం రా, ఆహా, మ‌ల్లీశ్వ‌రి, సైనికుడు, బాస్‌, సంక్రాంతితో పాలు ప‌లు తెలుగు సినిమాలు ర‌ఘునాథ‌రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై నటుడిగా తనదైన ముద్ర వేశారు. రుతురాగాలు, మొగలి రేకులతో పాటు పలు టీవీ సీరియల్స్ లో కీలక పాత్రల్లో కనిపించాడు.

అంత్య‌క్రియ‌లు...

రఘునాథరెడ్డి అంత్యక్రియలు మౌళాళీలోని హిందూ స్మశాన వాటికలో జరిగాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యులు, శివ‌పార్వ‌తితో పాటు మ‌రికొంత‌మంది న‌టులు ఆయ‌న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

 

Advertisement
Advertisement