Tollywood | టాలీవుడ్‌లో విషాదం – సీనియర్ ప్రొడ్యూసర్ కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఎం. అర్జునరాజు అనారోగ్య సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు అర్జునరాజు.
Entertainment | Published On Mar 13, 2026, 7.24 pm IST
Tollywood | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఎం. అర్జునరాజు అనారోగ్య సమస్యలతో శుక్రవారం కన్నుమూశారు. అలనాటి అగ్ర హీరో ఎన్టీఆర్ నుంచి నేటి అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున వరకు పలువురు టాప్ స్టార్స్ తో సినిమాలు చేశారు అర్జునరాజు. రోజా ఆర్డ్స్ బ్యానర్‌తో మరో నిర్మాత శివరామరాజుతో కలిసి ఎన్టీఆర్ హీరోగా కొండవీటి సింహం, వేటగాడు సినిమాలు చేశారు అర్జునరాజు. ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాలకు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సోలో నిర్మాతగా...
ఆ తర్వాత రోజా ఎంటర్‌ప్రైజెస్ అనే మరో బ్యానర్‌ను నెలకొల్పిన అర్జునరాజు సోలో ప్రొడ్యూసర్‌గా చిరంజీవి జేబుదొంగ, శ్రీకాంత్ మా నాన్నకు పెళ్లి, నాగార్జునతో బావనచ్చాడు, జాబిలితో పాటు మరికొన్ని సినిమాలు చేశారు అర్జునరాజు. హిందీలో జానీ దోస్త్, ఫర్జ్ ఔర్ కానూన్ అనే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. గత కొన్నేళ్లుగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. అర్జునరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



