త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్‌

తెలుగు రొమాంటిక్ మూవీ మ‌రువ త‌ర‌మా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రిషి ధ‌నుంజ‌య్‌, అవంతిక‌, అతుల్య హీరోహీరోయిన్లుగా న‌టించారు.

N

Entertainment | Published On Feb 10, 2026, 9.00 pm IST

OTT | ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.2 రేటింగ్‌
Advertisement

OTT |  తెలుగు రొమాంటిక్ మూవీ మ‌రువ త‌ర‌మా థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతుంది. రిషి ధ‌నుంజ‌య్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో అవంతిక‌, అతుల్య చంద్ర క‌థానాయిక‌లుగా న‌టించారు. లిరిసిస్ట్ చైత‌న్య వ‌ర్మ న‌డింప‌ల్లి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈటీవీ విన్‌లో...

వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14 మ‌రువ త‌ర‌మా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. మ‌రువ త‌ర‌మా మూవీకి విజ‌య్ బుల్గానిన్‌, ఆరిష్ మ్యూజిక్ అందించారు. గ‌తంలో ప్రేమ ఇష్క్ కాద‌ల్‌, వైశాఖం సినిమాల్లో హీరోగా న‌టించాడు రిషి ధ‌నుంజ‌య్‌. అవంతిక‌, అతుల్య చంద్ర ఈ సినిమాతోనే హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. క‌మ‌ర్షియ‌ల్‌గా మ‌రువ త‌ర‌మా ఫెయిల్యూర్‌గా నిలిచింది.

ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీ...

ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా మ‌రువ త‌ర‌మా మూవీ డైరెక్ట‌ర్ చైత‌న్య వ‌ర్మ తెర‌కెక్కించారు. రిషి (హ‌రీష్ ధ‌నుంజ‌య్‌), సింధు (అవంతిక‌), అన్వీ (అతుల్య చంద్ర‌) ఒకే ఆఫీస్‌లో ప‌నిచేస్తుంటారు. రిషి, సింధు ప్రేమ‌లో ప‌డ‌తారు. అన్వీ కూడా రిషిని ఇష్ట‌ప‌డుతుంది. కానీ త‌న ప్రేమ‌ను మ‌న‌సులోనే దాచుకుంటుంది. మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా రిషి, సింధు విడిపోతారు. ఆ త‌ర్వాత ఏమైంది? అన్వీ త‌న‌ను ఇష్ట‌ప‌డుతున్న విష‌యం రిషికి తెలిసిందా? రిషికి ద‌గ్గ‌ర కావాల‌ని సింధు ఎందుకు అనుకుంది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.చైత‌న్య వ‌ర్మ లిరిసిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆర్ ఎక్స్ 100, స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప‌లు తెలుగు సినిమాల‌కు గేయ‌ర‌చ‌యిత‌గా ప‌నిచేశాడు.

Advertisement
Advertisement