త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tollywood | డొనాల్డ్ ట్రంప్‌పై సెటైర్లు – పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో త‌రుణ్ భాస్క‌ర్ కొత్త మూవీ

ఓం శాంతి శాంతి శాంతి త‌ర్వాత హీరోగా త‌రుణ్ భాస్క‌ర్ మ‌రో కొత్త సినిమా చేయ‌బోతున్నాడు. పొలిటిక‌ల్ సెటైర్‌గా రాబోతున్న ఈ మూవీకి గాయ‌ప‌డ్డ సింహం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇందులో ఫ‌రియా అబ్దుల్లా , మాన‌స చెరుకూరి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

N

Entertainment | Published On Feb 6, 2026, 7.53 pm IST

Tollywood | డొనాల్డ్ ట్రంప్‌పై సెటైర్లు  – పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో త‌రుణ్ భాస్క‌ర్ కొత్త మూవీ
Advertisement

Tollywood | పెళ్లి చూపులు, ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాల‌తో డైరెక్ట‌ర్‌గా ప్ర‌తిభ‌ను చాటుకున్నారు త‌రుణ్ భాస్క‌ర్‌. గ‌త కొద్ది రోజులుగా ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌కు దూరంగా ఉంటోన్న త‌రుణ్ భాస్క‌ర్ యాక్ట‌ర్‌గానే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నారు. ఇటీవ‌లే ఓం శాంతి శాంతి శాంతి మూవీతో హీరోగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా మ‌రో కొత్త మూవీకి ఓకే చెప్పారు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నారు.

గాయ‌ప‌డ్డ సింహం...

త‌రుణ్ భాస్క‌ర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుక్ర‌వారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా మేక‌ర్స్ టైటిల్‌తో పాటు ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు గాయ‌ప‌డ్డ సింహం అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమాకు క‌శ్య‌ప్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రో టాలీవుడ్ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ సాదినేని ప్ర‌జెంట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అమెరికా జెండా...

ప్రీ లుక్ పోస్ట‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. అమెరిక‌న్ జెండాను పోలిన విధంగా ఎరుపు, తెలుగు గీత‌లు, న‌క్ష‌త్రాలు ఈ పోస్ట‌ర్‌పై క‌నిపిస్తున్నాయి. డోనాల్ ట్రంప్‌ను పోలిన క్యారికేచ‌ర్‌, రివాల్వ‌ర్‌తో పాటు పాత‌కాలం నాటి న‌ట‌రాజ్ కంపాస్ బాక్స్ ఉన్నాయి. వీటితో పాటు పాస్‌పోర్ట్ స్టంప్ కూడా ఈ ప్రీ లుక్ పోస్ట‌ర్‌పై ఉండ‌టం క్యూరియాసిటీని క‌లిగిస్తోంది.
ఇవ‌న్నీ చూస్తుంటే పొలిటిక‌ల్ సెటైర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. న‌వ్వ‌కండి ఇది చాలా సీరియ‌స్ మ్యాట‌ర్ అంటూ టైటిల్ కింద ఉన్న క్యాప్ష‌న్ ఆక‌ట్టుకుంటోంది. డొనాల్డ్ ట్రంప్ ప్ర‌వేశ‌పెట్టిన‌ సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా అమెరికాలో ఇండియ‌న్ స్టూడెంట్స్ ఎదుర్కొనే ఇబ్బందుల‌ను ఫ‌న్నీగా ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

టీజ‌ర్ రిలీజ్‌...

గాయ‌ప‌డ్డ సింహం సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా, మాన‌స చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ట్యాక్సీవాలా విష్ణు, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. గాయ‌ప‌డ్డ సింహం షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ట‌. కేవ‌లం ఓ పాట చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే బ్యాలెన్స్‌గా ఉంద‌ట‌. ఈ సినిమా టీజ‌ర్‌ను ఫిబ్ర‌వ‌రి 9న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు సూర్య‌ప్ర‌కాష్ జోశ్యుల సంగీతాన్ని అందిస్తున్నారు.

 

Advertisement
Advertisement