OTT | ఒకే రోజు ఒకే ఓటీటీలో రిలీజైన రెండు తెలుగు సినిమాలు – ఒకటి మిస్టరీ థ్రిల్లర్ – మరోటి యాక్షన్ లవ్‌స్టోరీ
తెలుగు సినిమాలు వంచన దేవగుడి మంగళవారం ఒకే ఓటీటీలో రిలీజయ్యాయి. సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Entertainment | Published On Mar 3, 2026, 2.51 pm IST
OTT | మంగళవారం ఒకే రోజు రెండు తెలుగు సినిమాలు సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజయ్యాయి. వంచనతో పాటు దేవగుడి సినిమాలు ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా సైలెంట్‌గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వంచన మూవీ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందగా....దేవగుడి యాక్షన్ లవ్‌స్టోరీగా రూపొందింది.
వంచన మూవీ
క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వంచన సినిమాలో ఉమామహేష్ మార్పు హీరోగా నటించాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహించాడు. సోనీ రెడ్డి, ఆర్‌కేనాయుడు, సూర్య కీలక పాత్రల్లో నటించారు.
అరకువాలీలోని ఓ చర్చ్ ఫాదర్ దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసులో చలం అనే క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. చలం తరఫున వాదించడానికి క్రిమినల్ లాయర్ ఉమామహేష్ ముందుకొస్తాడు. లాయర్‌గా ఇదే తనకు తొలి కేసు కావడంతో ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడు. ఈ మర్డర్ మిస్టరీని అతడు ఎలా సాల్వ్ చేశాడు? చర్చ్ ఫాదర్‌ను హత్య చేసింది ఎవరు అనే అంశాలతో ఈ మూవీ రూపొందింది.
దేవగుడి...
దేవగుడి మూవీలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అభినవ్ శౌర్య, అనుశ్రీ, రఘు కుంచె ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహించాడు.
దేవగుడికి చెందిన వీరారెడ్డి ఫ్యాక్షన్ లీడర్. తనవద్ద పనిచేసే అనుచరుడి కొడుకు ధర్మతో వీరారెడ్డి కూతురు శ్వేత ప్రేమలో పడుతుంది. వారి ప్రేమను వీరారెడ్డి ఒప్పుకోడు. ధర్మ నుంచి ఊరి నుంచి వెళ్లగొడతాడు. అదే టైమ్‌లో శ్వేత కనిపించకుండాపోతుంది. ఆ తర్వాత ఏమైంది? శ్వేత మిస్సింగ్‌కు ధర్మకు సంబంధం ఉందా? అన్నదే ఈ మూవీ కథ. కుల వ్యవస్థ, పరువు హత్యల నేపథ్యంలో మెసేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. కమర్షియల్‌గా వంచన, దేవగుడి థియేటర్లలో ఫెయిల్యూర్స్‌గా నిలిచాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



