Chidambaram OTT | థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు మూవీ
లేటెస్ట్ తెలుగు మూవీ శ్రీ చిదంబరం థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 19న ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ విడుదల కాబోతుంది. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి వినయ్ రత్నం దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Feb 13, 2026, 5.24 pm IST
Chidambaram OTT | గత వారం థియేటర్లలో రిలీజైన శ్రీ చిదంబరం మూవీ రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట, గోపీనాథ్, శివకుమార్ కీలక పాత్రల్లో నటించారు. వినయ్ రత్నం దర్శకత్వం వహించాడు. కొత్త నటీనటులతో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీ చిదంబరం మంచి సినిమాగా ఆడియెన్స్‌ను మెప్పించింది. కానీ కమర్షియల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.
ఈటీవీ విన్‌లో...
ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజైన శ్రీ చిదంబరం అప్పుడే ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీతో పాటు ప్లాట్‌ఫామ్ శుక్రవారం కన్ఫామ్ అయ్యాయి. ఫిబ్రవరి 19న ఈటీవీ విన్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతుంది. మెల్లకన్ను సమస్యతో బాధపడే ఓ యువకుడి కథతో వైకల్యం మనిషికే కానీ మనసుకు కాదనే సందేశంతో దర్శకుడు వినయ్ రత్నం ఈ సినిమాను తెరకెక్కించారు. మలయాళ సినిమాల తరహాలో రా అండ్ రస్టిక్‌గా చిదంబరం మూవీని రూపొందించారు.
చిదంబరం కథ...
సోలమన్‌కు మెల్లకన్ను ఉంటుంది. అందరూ అతడిని చిదంబరం అని పిలుస్తూ అవమానిస్తుంటారు. తన మెల్లకన్ను కనిపించకుండా ఎప్పుడు కళ్లద్దాలు పెట్టుకొని తిరుగుతుంటాడు. తన ఊరికే చెందిన లీలను ప్రేమిస్తుంటాడు సోలమన్. తన ప్రేమను లీలకు సోలమన్ చెప్పాడా? కళ్లద్దాలు తీసేసి తిరగమని సోలమన్‌కు లీల ఎందుకు చెప్పింది అన్నదే ఈ మూవీ కథ.
శ్రీ చిదంబరం మూవీతో హీరోహీరోయిన్లతో పాటు చాలా మంది కొత్త నటీనటులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. డైరెక్టర్‌గా వినయ్ రత్రానికి ఇదే డెబ్యూ మూవీ. ఈ సినిమాకు చందు రవి మ్యూజిక్ అందించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



