త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | రెండు ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్‌

ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన తెలుగు మూవీ స‌న్ ఆఫ్ రెండు ఓటీటీల‌లో రిలీజైంది. ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సాయి సింహాద్రి హీరోగా న‌టించిన ఈ సినిమాలో సీనియ‌ర్ హీరో వినోద్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

N

Entertainment | Published On May 2, 2026, 8.19 pm IST

Telugu OTT | రెండు ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు మూవీ – క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్‌
Advertisement

Telugu OTT | తండ్రీ కొడుకుల ఎమోష‌న్‌తో తెర‌కెక్కిన లేటెస్ట్ తెలుగు మూవీ స‌న్ ఆఫ్ ప్ర‌స్తుతం రెండు ఓటీటీల‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవ‌లే ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోకి వ‌చ్చింది. రెండు ఓటీటీల‌లో ట్రెండింగ్‌లో ఉంది.

వినోద్ కుమార్‌...

స‌న్ ఆఫ్ లో సాయి సింహాద్రి హీరోగా న‌టించాడు. బ‌త్తుల స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో మీరా రాజ్ హీరోయిన్‌గా న‌టించింది. సీనియ‌ర్ హీరో వినోద్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించాడు.
ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రు స‌న్ ఆఫ్ మూవీ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. తండ్రీ కొడుకుల ఎమోష‌న్‌కు ల‌వ్‌స్టోరీ, కామెడీని జోడించి ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. స‌న్ ఆఫ్‌కు హీరో సాయి సింహాద్రి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. కాన్సెప్ట్‌తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంద‌నే కామెంట్స్ వ‌చ్చాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందింది. ఫ‌స్ట్ హాఫ్‌లో ల‌వ్‌స్టోరీతో...సెకండాఫ్‌లో కోర్ట్ రూమ్ డ్రామాగా సాగుతుంది. రిషి మ్యూజిక్ అందించాడు. వాసు ఇంటూరి, ఆమ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత వినోద్ కుమార్‌, ఆమ‌ని కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూవీ ఇది.

తండ్రీ కొడుకుల క‌థ‌...

వెంక‌ట్రావు (వినోద్ కుమార్‌) భార్య చ‌నిపోవ‌డంతో కొడుకు ఆనంద్‌ను (సాయి సింహాద్రి) క‌ష్ట‌ప‌డి పెంచి పెద్ద‌చేస్తాడు. కొడుకు విష‌యంలో ఎన్నో అంచ‌నాలు పెట్టుకుంటాడు వెంక‌ట్రావు. కానీ ఆనంద్ మాత్రం తండ్రి ఆశ‌యాల‌కు భిన్నంగా పెరుగుతాడు. చ‌దువు గాలికి వ‌దిలేసి స్నేహితుల‌తో జులాయిగా తిరుగుతుంటాడు. చిన్న‌నాటి స్నేహితురాలు అనుతో (మీరా రాజ్‌) ప్రేమ‌లో ప‌డ‌తాడు ఆనంద్‌. ఆమె పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటాడు. కానీ కొడుకు ప్రేమ‌కు వెంక‌ట్రావు మాత్రం అడ్డు చెబుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది? క‌న్న తండ్రిపైనే ఆనంద్ కేసు ఎందుకు వేశాడు? తండ్రి గొప్ప‌త‌నాన్ని ఆనంద్ ఎలా తెలుసుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement