Actress Pratyusha | సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ..
Actress Pratyusha | ప్రముఖ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో కొనసాగుతూ వస్తున్న ఈ కేసు మంగళవారం ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యూష కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టులోని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఇవాళ తీర్పును వెల్లడించనుంది.
Entertainment | Published On Feb 17, 2026, 7.10 am IST
Actress Pratyusha | ప్రముఖ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో కొనసాగుతూ వస్తున్న ఈ కేసు మంగళవారం ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యూష కేసును విచారిస్తున్న సుప్రీం కోర్టులోని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం ఇవాళ తీర్పును వెల్లడించనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సరోజినీ దేవి గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సిద్ధార్థ రెడ్డికి జైలు శిక్షను పెంచాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. 2012లో సరోజినీ దేవి సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఇప్పటి వరకు ఇరు వర్గాలు వాదనలను వినిపిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తుది తీర్పు వెలువడనుంది.
శిక్ష తగ్గించిన హైకోర్టు..
రెండు దశాబ్దాల క్రితం అప్పటి వర్ధమాన నటి ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. 2002లో ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిలు ఆత్మహత్యకు యత్నించారు. మరుసటి రోజు ఫిబ్రవరి 24వ తేదీన ప్రత్యూష హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా, సిద్ధార్థ రెడ్డి మాత్రం బతికి బయటపడ్డాడు. అయితే ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. దీంతో సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజినీ దేవి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తుది తీర్పు వెలువడనుండడంతో ఈకేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రత్యూషను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలిపినందున సెక్షన్ 302 కింద శిక్ష విధించాలని, లేదా సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష విధించాలని సుప్రీంకోర్టులో ప్రత్యూష తరఫున తల్లి సరోజినీ దేవి వాదనలు వినిపించారు. అయితే ఇద్దరూ కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పాడు అన్న అంశం ఉత్పన్నం కాదని నిందితుడి తరఫున వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు వెలువరించనున్న తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



