Sree Vishnu | అప్పుడు బాలకృష్ణ – ఇప్పుడు శ్రీవిష్ణు – ఒకే రోజు ఒకే హీరో రెండు సినిమాలు రిలీజ్
శ్రీవిష్ణు హీరోగా నటించిన రెండు సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మృత్యుంజయ్‌తో పాటు విష్ణువిన్యాసం ఫిబ్రవరి 27న బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నట్లు చెబుతోన్నారు.
Entertainment | Published On Feb 12, 2026, 10.32 am IST
Sree Vishnu | ఓ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీపడటం అన్నది చాలా అరుదు. అలాంటి అరుదైన సంఘటన శ్రీవిష్ణు కెరీర్‌లో జరుగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీవిష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ ఫిబ్రవరి 27న రిలీజ్ కాబోతుంది. అదే రోజు శ్రీవిష్ణు మరో మూవీ విష్ణువిన్యాసం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో చేసుకున్న డీల్స్ కారణంగా మృత్యుంజయ్ విష్ణువిన్యాసం సినిమాలను సేమ్ డే రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఇప్పటికే మృత్యుంజయ్ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. మరో రెండు మూడు రోజుల్లో విష్ణువిన్యాసం విడుదల తేదీకి సంబంధించి ప్రకటన రానుందని అంటున్నారు.
ఓటీటీ డీల్స్...
గత కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో ఓటీటీ డీల్స్‌కు అనుగుణంగా సినిమాల రిలీజ్‌లు ఫిక్సవుతున్నాయి. మృత్యుంజయ్, విష్ణువిన్యాసం సినిమాలను రెండు వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కొనుగోలు చేశాయి. కానీ థియేట్రికల్ రిలీజ్ డేట్‌కు సంబంధించి రెండు ప్లాట్‌ఫామ్స్ ఒకే డేట్ స్లాట్‌ను కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరిలో ఏ ప్రొడ్యూసర్ వెనక్కి తగ్గినా ఓటీటీ డీల్ క్యాన్సిల్ అవుతుంది. త్రీవంగా నష్టపోవాల్సివస్తుంది. ఒకే రోజు రెండు సినిమాలను రిలీజ్ చేయడం మినహా మేకర్స్‌కు మరో దారి లేకుండాపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాల్లో విష్ణువిన్యాసం కామెడీగా తెరకెక్కుతోండగా.... మృత్యుంజయ్ పాటలు, హీరోయిన్ లేకుండా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్. విష్ణువిలాసం సినిమాతో మారుతిరావు దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
బాలకృష్ణ...నాని...
ఓ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీపడటం అన్నది టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు సేమ్ డే విడుదలయ్యాయి. ఇందులో బంగారు బుల్లోడు బ్లాక్‌బస్టర్‌గా నిలవగా...నిప్పురవ్వ ఫెయిలైంది. ఆ తర్వాత నాచురల్ స్టారి నాని విషయంలో ఇలాగే జరిగింది. నాని హీరోగా జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రమణ్యం ఒకే రోజు థియేటర్లలోకి వచ్చాయి. ఇందులో ఎవడే సుబ్రమణ్యం బ్లాక్‌బస్టర్‌గా నిలివగా...జెండాపై కపిరావు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. చాలా రోజుల తర్వాత శ్రీవిష్ణు సినిమాతో మళ్లీ డబుల్ ట్రీట్ సీన్ రిపీట్ కాబోతుండటం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



