Sreeleela | షూటింగ్‌ల మధ్యే పరీక్షలకు హాజరయ్యా.. డాక్టర్ డే సందర్భంగా శ్రీలీల ఆసక్తికర కామెంట్స్.
Sreeleela | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వైద్య విద్య కొనసాగిస్తూ వచ్చింది. డాక్టర్స్ డే సందర్భంగా తన సినీ ప్రయాణంతో పాటు ఎంబీబీఎస్ చదువును ఎలా బ్యాలెన్స్ చేసిందో ఆమె వెల్లడించింది.
Entertainment | Published On Jul 1, 2026, 10.25 pm IST
Sreeleela | టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వైద్య విద్య కొనసాగిస్తూ వచ్చింది. డాక్టర్స్ డే సందర్భంగా తన సినీ ప్రయాణంతో పాటు ఎంబీబీఎస్ చదువును ఎలా బ్యాలెన్స్ చేసిందో ఆమె వెల్లడించింది. చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలన్నది తన కల అని చెప్పిన శ్రీలీల.. నటిగా అవకాశాలు వచ్చినప్పటికీ వైద్య విద్యకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చానని తెలిపింది. ‘వైరల్ వయ్యారి’ పాట చిత్రీకరణ సమయంలోనూ పరీక్షల కోసం సమయాన్ని కేటాయించినట్లు చెప్పింది.
‘‘డాక్టర్ కావడం నా చిన్ననాటి కల. అదే నా అతిపెద్ద అభిరుచి. ‘వైరల్ వయ్యారి’ షూటింగ్ జరుగుతున్న సమయంలో కూడా నా ఎంబీబీఎస్ పరీక్షలకే మొదటి ప్రాధాన్యం ఇచ్చాను. షూటింగ్ పూర్తయ్యాక వెంటనే ప్రాక్టికల్స్‌కు వెళ్లేదాన్ని. మధ్యలో విరామం దొరికితే మళ్లీ సెట్స్‌కు వచ్చి షూటింగ్‌లో పాల్గొనేదాన్ని. ఇది అంత సులభం కాదు. కానీ వైద్య విద్య నాకు ఎంతో విలువైనది’’ అని శ్రీలీల చెప్పింది. సినిమా షూటింగ్‌లు, కాలేజ్, పరీక్షలు.. ఇలా అన్నింటినీ ఒకేసారి నిర్వహించడం అంత తేలికైన విషయం కాదని, అయితే వైద్య రంగంపై ఉన్న ఇష్టమే తనకు ప్రేరణగా నిలిచిందని ఆమె పేర్కొంది. ఇక ‘వైరల్ వయ్యారి’ పాట ‘జూనియర్’ సినిమాలోనిది. ఈ చిత్రంలో కీరీటి రెడ్డి హీరోగా నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీలీల చివరిసారిగా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటించింది. పవన్ సరసన మెరిసింది. బాలీవుడ్‌లో అనురాగ్ బసు మూవీలో నటిస్తోంది. తమిళంలో ఓం చాప్టర్ 1: ఉధిరం బ్లూడ్ ఉడ్ మూవీలో కనిపించనుంది.
తాజావార్తలు
- ●Telangana Farmers Commission | 2.3 లక్షల మంది గిరిజన రైతులకు రేవంత్ సర్కార్ వరం: ఆ భూములన్నీ ఇకపై ఆన్లైన్లోనే
- ●Harish Rao on Singareni Scams | సింగరేణిలో కాంగ్రెస్ వేల కోట్ల దోపిడీ.. రేవంత్ బామ్మర్దికే ఓబీ టెండర్లు: పీపీటీతో హరీష్ రావు సంచలన ప్రజెంటేషన్
- ●Ilaiyaraaja | కాపీ రైట్ వివాదం కేసు.. ఢిల్లీ హైకోర్టులో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు షాక్..!
- ●Pasham Yadagiri | 'ఇడుపు కాయితం'పై ఎందుకంత రచ్చ? తెలంగాణ సీఎం రేవంత్ కాదు.. చంద్రబాబే
- ●TTD | శ్రీవారి భక్తులకు అలర్ట్.. నో హారన్ జోన్‌గా తిరుమల
- ●Harish Rao | సింగరేణి అధికారులు సమ్మెబాట పట్టడం చరిత్రలో తొలిసారి

Telangana Farmers Commission | 2.3 లక్షల మంది గిరిజన రైతులకు రేవంత్ సర్కార్ వరం: ఆ భూములన్నీ ఇకపై ఆన్లైన్లోనే

Harish Rao on Singareni Scams | సింగరేణిలో కాంగ్రెస్ వేల కోట్ల దోపిడీ.. రేవంత్ బామ్మర్దికే ఓబీ టెండర్లు: పీపీటీతో హరీష్ రావు సంచలన ప్రజెంటేషన్

Ilaiyaraaja | కాపీ రైట్ వివాదం కేసు.. ఢిల్లీ హైకోర్టులో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు షాక్..!

Pasham Yadagiri | 'ఇడుపు కాయితం'పై ఎందుకంత రచ్చ? తెలంగాణ సీఎం రేవంత్ కాదు.. చంద్రబాబే




