త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrithyunjay OTT | ఓటీటీలోకి శ్రీవిష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో మైండ్‌బ్లాక్‌

శ్రీవిష్ణు హీరోగా న‌టించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ మృత్యుంజ‌య్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఏప్రిల్ 3 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Mar 15, 2026, 7.01 pm IST

Mrithyunjay OTT | ఓటీటీలోకి శ్రీవిష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ – ఊహించ‌ని ట్విస్ట్‌ల‌తో మైండ్‌బ్లాక్‌
Advertisement

Mrithyunjay OTT |  గ‌త కొన్నేళ్లుగా కామెడీ సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోన్నారు శ్రీవిష్ణు. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా, సింగిల్ స‌క్సెస్‌ల‌తో కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా మారిపోయారు. త‌న పంథాకు భిన్నంగా ఇటీవ‌ల మృత్యుంజ‌య్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ చేశాడు శ్రీవిష్ణు. సుకుమార్ శిష్యుడు హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మంచి వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.

నెట్‌ఫ్లిక్స్‌...

శ్రీవిష్ణుకు ఉన్న ఇమేజ్‌, మార్కేట్ కార‌ణంగా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా మృత్యుంజ‌య్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏప్రిల్ 3న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో రిలీజ్ కానున్న‌ట్లు చెబుతున్నారు.

రెబా మోనికా జాన్‌...

మృత్యుంజ‌య్ మూవీలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా న‌టించింది. వీర్ ఆర్య‌న్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాలో బాలాదిత్య‌, ర‌చ్చ‌ర‌వి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కాల‌భైర‌వ మ్యూజిక్ అందించారు. మృత్యుంజ‌య్ కాన్సెప్ట్‌తో పాటు ట్విస్ట్‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. సీరియ‌స్ రోల్‌లో శ్రీవిష్ణు చూపించిన వేరియేష‌న్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

జై ఇన్వేస్టిగేష‌న్‌...

క్రైమ్ రిపోర్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు జై (శ్రీవిష్ణు). కానీ అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల ఓ న్యూస్ పేప‌ర్‌లో యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేయాల్సివ‌స్తుంది. చ‌నిపోయిన వారి ఇంటికి వెళ్లి శ్ర‌ద్ధాంజ‌లి యాడ్స్ తీసుకొస్తుంటాడు. అచ్యుత్ రావ్ అనే వ్య‌క్తి మ‌ర‌ణించ‌డంతో అత‌డి ఇంటికి వెళ‌తాడు జై. క‌రెంట్ షాక్‌తో తండ్రి గురించి అచ్యుత్‌రావ్ కూతురు ప‌డుతోన్న బాధ జైని క‌దిలిస్తుంది. అచ్యుత్‌రావ్ చ‌నిపోయిన కొద్ది రోజుల‌కే క‌రెంట్ షాక్‌తోనే మ‌రో వ్య‌క్తి చ‌నిపోతాడు. మామూలు ప్ర‌మాదాలుగానే ఈ రెండు కేసుల‌ను పోలీసులు భావిస్తారు. కానీ ప్రీ ప్లాన్‌డ్ మ‌ర్డ‌ర్స్ అని జై ఆరోపిస్తాడు. అస‌లైన హంత‌కుడిని జై ఎలా క‌నిపెట్టాడు. ఈ హ‌త్య‌ల‌కు సాధుకు (వీర్ ఆర్య‌న్‌) ఉన్న సంబంధ‌మేమిటి? జై ఇన్వేస్టిగేష‌న్‌లో అత‌డికి ఐపీఎస్ ఆఫీస‌ర్ సీతా ప‌ర‌శురామ్ (రెబా మోనికా జాన్‌) ఎలా స‌హ‌క‌రించింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement
Advertisement