త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shweta Basu | టాలీవుడ్‌లోకి శ్వేతాబ‌సు రీ ఎంట్రీ..! ఫ‌స్ట్ సినిమా హీరోతోనే..!

Shweta Basu | శ్వేతా బ‌సు ప్ర‌సాద్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ చిత్రంలో ఆమె చెప్పిన “ఎకాడా.. ఎకాడా” డైలాగ్ అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసి పెద్ద పాపులారిటీ తెచ్చింది.

P

Entertainment | Published On Apr 6, 2026, 11.01 am IST

Shweta Basu | టాలీవుడ్‌లోకి శ్వేతాబ‌సు రీ ఎంట్రీ..! ఫ‌స్ట్ సినిమా హీరోతోనే..!
Advertisement

Shweta Basu | శ్వేతా బ‌సు ప్ర‌సాద్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ చిత్రంలో ఆమె చెప్పిన “ఎకాడా.. ఎకాడా” డైలాగ్ అప్పట్లో ట్రెండ్ క్రియేట్ చేసి పెద్ద పాపులారిటీ తెచ్చింది. వ‌రుణ్ సందేశ్ హీరోగా నటించిన ఆ ఫస్ట్ మూవీలో ఇంటర్ విద్యార్థినిగా తన అమాయకత్వం, అందం, చలాకీతనంతో ప్రేక్షకుల మ‌న్న‌న‌లు పొందింది. ఆ తర్వాత ‘రైడ్’, ‘కలవర్ కింగ్’, ‘కాస్కో’, ‘ప్రియుడు’ చిత్రాల్లో క‌నిపించింది. జీనియస్ మూవీలో ఐటమ్ సాంగ్‌లో క‌నిపించింది. 20217లో చివ‌ర‌గా మిక్చ‌ర్ పొట్లం ప్రాజెక్టులో న‌టించింది. ఆయా సినిమాలు ఎక్కువ‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో అవ‌కాశాలు కరువ‌య్యాయి.

దాంతో బాలీవుడ్‌లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ప‌లు ప్రతిష్టాత్మక ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌ల‌లో మెరిసింది. ‘ది తాష్కెంట్ ఫైల్స్’, ‘సిరియస్ మెన్’, ‘ఇండియా లాక్ డౌన్’, ‘క్రిమినల్ జస్టిస్’ త‌దిత‌ర వెబ్‌సిరీస్‌ల‌తో మంచి క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం ఎక్కువగా ఓటీటీ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. తాజాగా మ‌రోసారి తెలుగు తెర‌పై క‌నిపించ‌బోతోంది. ఫస్ట్ మూవీలో వరుణ్ సందేశ్‌తో కాంబినేషన్ మళ్లీ ఒక కొత్త ప్రాజెక్ట్‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాణ సంస్థ శ్వేతాను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పినట్లు వర్గాల సమాచారం. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోయే శ్వేతా, వరుణ్ సందేశ్‌తో న‌టించ‌నుంద‌నే వార్త‌లు భారీ అంచ‌నాలున్నాయి. అయితే, అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. వరుణ్ సందేశ్ ఇటీవల ‘నయనం’ వెబ్ సిరీస్‌తో విజయం సాధించి.. ప్రస్తుతం ఈ సిరీస్ జీ5లో అందుబాటులో ఉంది.

Advertisement
Advertisement