త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | ఫొటో ఫ్రేమ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని.. ఉబ్బితబ్బిబైన శృతి హాసన్‌..!

Shruti Haasan | నటి శృతి హాసన్‌కు ఓ అభిమాని ఫొటోఫ్రేమ్‌ను గిఫ్ట్‌గా పంపాడు. ఆ గిఫ్ట్‌ను కొరికి చూపిస్తూ తన ఆనందాన్ని ఆమె అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటో ఫ్రేమ్‌ తినడానికి వీలుండడం విశేషం.

P

Entertainment | Published On Apr 26, 2026, 3.58 pm IST

Shruti Haasan | ఫొటో ఫ్రేమ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన అభిమాని.. ఉబ్బితబ్బిబైన శృతి హాసన్‌..!
Advertisement

Shruti Haasan | టాలీవుడ్‌ బ్యూటీ శృతి హసన్‌కు ఇటీవల వచ్చిన ఒక ప్రత్యేక గిఫ్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా కనిపించే ఫోటో ఫ్రేమ్‌లా ఉన్న ఈ గిఫ్ట్‌లో ఒక ట్విస్ట్ ఉంది. అది చూసిన శృతి చిన్నపిల్లలా ఎగ్జైట్‌ అయ్యింది. తన అఫీషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ వీడియోను షేర్‌ చేసింది. అందులో ఆమెకు గిఫ్ట్‌గా వచ్చిన అందమైన ఫొటోప్రేమ్‌ను చూపించింది. ఆ ఫ్రేమ్‌లో ఆమె ఫొటోనే ఉండడం ఆకట్టుకుంది. ‘ఎవరో నాకు ఈ లవ్లీ ఫొటో ఫ్రేమ్ ఇచ్చారు. క్యూట్‌గా లేదూ?’ అంటూ అభిమానులతో షేర్‌ చేసుకుంది. అయితే, వెంటనే అందరికీ షాక్ ఇస్తూ ఆ ఫ్రేమ్‌ను ఆమె కొరికి చూపించింది. అప్పుడు అది సాధారణ ఫ్రేమ్ కాదని, దాన్ని తినొచ్చనే విషయం తెలిసింది. ‘ఇలాంటి వాటికి నేను ఇంకా ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతానో తెలియదు. కానీ, చాలా కూల్‌గా ఉంది’ అంటూ స్పందించింది. ఆ తర్వాత మళ్లీ మరోసారి ఆ ఫ్రేమ్‌ను కొరికి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

అంబూర్‌ బిర్యానీ చేసి..

శృతి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితం, షూటింగ్‌ల మధ్యలో జరిగిన చిన్న చిన్న విషయాలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆమె పోస్టులు ఎప్పుడూ అభిమానులను ఆకట్టుకుంటుంటాయి. ఇదిలా ఉండగా ఇటీవల శృతి తనలోని చెఫ్‌ను బయటపెట్టింది. ఇంట్లోనే అంబూర్ బిర్యానీతో పాటు కత్తిరికాయ్ కర్రీ తయారు చేసి.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘హోమ్‌మేడ్ అంబూర్ బిర్యానీ, కత్తిరికాయ్ కర్రీ.. మళ్లీ కుకింగ్ మోడ్‌లోకి వచ్చాను’ అంటూ స్టోరీ పెట్టింది. గతంలో షూటింగ్‌కు బ్రేక్ వచ్చిన రోజున ఒక సింపుల్, హెల్తీ స్నాక్ రెసిపీని కూడా అభిమానులతో పంచుకుంది. ఖర్జూరాలు, వెనిల్లా గ్రీక్ యోగర్ట్, ఫ్లేకీ సాల్ట్, ఆలివ్ ఆయిల్‌తో చేసిన ఆ స్నాక్ తనకు చాలా నచ్చిందని తెలిపింది. స్క్రిప్ట్ చదువుతూ మధ్యలో ఇలా కొత్త రెసిపీలు ట్రై చేయడం తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది.

సినిమాల లైనప్‌..

ఇక శృతి హాసన్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’ అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. తమిళంలోనూ ట్రైన్‌ మూవీలో విజయ్‌ సేతుపతి సరసన కనిపించనుంది. శృతి చేతిలో ఉన్న మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ సలార్‌. ఇందులో ప్రభాస్‌ సరసన నటిస్తోంది. సలార్‌: సీజ్‌ఫైర్‌ 2023 విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా రెండో పార్ట్‌ సలార్‌:శౌర్యాంగ పర్వం మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుందనేది త్వరలో తెలియనుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టుల్లో బిజీగా ఉండగా.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సైతం జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తయితే ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement