త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shalini Pandey | ఆ పని చేసి ఉండకపోతే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.. షాలిని పాండే ఆసక్తికర వ్యాఖ్యలు..!

Shalini Pandey | తన సినీ ప్రయాణంపై ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకునేందుకు ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. నటి కావాలన్న లక్ష్యంతో ఇంటిని విడిచిపెట్టిన తన నిర్ణయాన్ని ఇప్పటికీ ఎంతో సానుకూలంగా గుర్తు చేసుకుంటానని తెలిపింది.

P

Entertainment | Published On Feb 22, 2026, 1.30 pm IST

Shalini Pandey | ఆ పని చేసి ఉండకపోతే ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.. షాలిని పాండే ఆసక్తికర వ్యాఖ్యలు..!
Advertisement

Shalini Pandey | తన సినీ ప్రయాణంపై ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకునేందుకు ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. నటి కావాలన్న లక్ష్యంతో ఇంటిని విడిచిపెట్టిన తన నిర్ణయాన్ని ఇప్పటికీ ఎంతో సానుకూలంగా గుర్తు చేసుకుంటానని తెలిపింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలిని పాండేకు ‘సినీ ఇండస్ట్రీలో ఎలాంటి వారసత్వం లేకుండా స్వతంత్రంగా ఎలా ప్రయాణం సాగించారు? మీ కలలను సాధించేందుకు ఇంటిని వదిలి వచ్చిన ఆ దశను ఇప్పుడు ఎలా చూస్తున్నారు?’ అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆమె స్పందిస్తూ ‘నా జీవితంలో తీసుకున్న అత్యుత్తమ నిర్ణయం అదే అని నేను భావిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా చేయాలనే కోరిక ఉంటే, తమ కలలను తప్పక అనుసరించాలి. నేను నా కలను సాధించేందుకు ప్రయత్నించకపోయి వేరే దారి ఎంచుకుని ఉంటే ఈ రోజు సంతోషంగా ఉండేదాన్నని అనుకోవడం లేదు.

ఆ నిర్ణయం తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ దశను నేను ఎప్పుడూ సానుకూల ధోరణిలోనే గుర్తు చేసుకుంటాను. ఈరోజు ఇక్కడ ఉండేందుకు ఆ మార్గాన్ని ఎంచుకున్నందుకు నా పట్లనే నాకు కృతజ్ఞతాభావం ఉంది’ అని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎలాంటి సహకారం లేకుండా నిలదొక్కుకోవడంపై మాట్లాడుతూ ‘ఎదుగుదల దశలో ఉన్నప్పుడు ఓర్పు, నిరంతర ప్రయత్నం అత్యంత అవసరం. అదే జీవితం. ఈ పరిశ్రమ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఓర్పుతో ఉండడం నేర్పింది. నా మీద నాకున్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేసింది. మన ఎదుగుదలలో స్థిరత్వం ఎంతో కీలకం అని నేను నమ్ముతున్నాను. అదే నా జీవిత విధానం’ అంటూ షాలిని వివరించింది. ఇదిలా ఉండగా.. షాలిని పాండే సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల ‘బ్యాండ్‌వాలే’ వెబ్‌సిరీస్‌లో నటించింది. అలాగే, రాహు-కేతు మూవీలోనూ కనిపించింది. చివరిసారిగా తెలుగులో నిశ్శబ్దం మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌పై దృష్టి సారించింది.

Advertisement
Advertisement